Andhra Pradesh

News March 26, 2024

REWIND: గుంటూరులో గల్లా జయదేవ్‌దే అత్యల్పం

image

గుంటూరు లోక్‌సభ నుంచి మహామహులు ఎన్నికయ్యారు. ఎన్జీ రంగా, లాల్ జాన్ బాషా, కొత్త రఘురామయ్య, రాయపాటి జయకేతనం ఎగురవేశారు. గత 2 పర్యాయాలు గల్లా జయదేవ్ ఇక్కడ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 69,111 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన.. 2019లో కేవలం 4,205 ఓట్లతో గట్టెక్కారు. ఈ లోక్‌సభ స్థానంలో ఇదే అత్యల్పం. ఈ ఎన్నికల్లో TDP కూటమి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, YCP నుంచి కిలారు రోశయ్య బరిలో దిగుతున్నారు.

News March 26, 2024

ఘంటసాల మేనల్లుడు మృతి

image

గాన గంధర్వుడు ఘంటసాల మేనల్లుడు బుద్దు వెంకటసుబ్బయ్య శర్మ(75) మంగళవారం మోపిదేవిలో అనారోగ్యంతో మరణించారు. ఈయన వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయుడు. నెమలి, ఏటిమొగ, నాగాయలంక, తలగడదీవి, బావదేవరపల్లి ఉన్నత పాఠశాలలో పని చేశారు. దాదాపు 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వంశపారపర్యంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకుడిగా ఈయన పని చేశారు.

News March 26, 2024

కృష్ణా జిల్లాలో 144 సీవిజిల్ ఫిర్యాదులు పరిష్కారం

image

సీ విజిల్‌కు అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సీవిజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 144 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. వీటిలో అధికంగా రాజకీయ నాయకుల ప్లెక్సీలు తొలగించాలని, శిలాఫలకాలపై పేర్లు మూసి వేయాలని ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.

News March 26, 2024

బాలికపై లైంగిక దాడికి యత్నం.. 10ఏళ్ల జైలు శిక్ష

image

రాజవొమ్మంగి మండలం మారేడుబాక గ్రామానికి చెందిన చిట్టోజి లోవరాజుకి 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చిందని జడ్డంగి ఎస్సై రఘునాథరావు తెలిపారు. 2018 ఆగస్టు 3వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై నిందితుడు లైంగిక దాడికి యత్నించగా.. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో దాడిచేసి గాయపరిచాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందని తెలిపారు.

News March 26, 2024

నెల్లూరు: YCP కీలక నేత గుండెపోటుతో మృతి

image

వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, నెల్లూరులో సీనియర్ రాజకీయ నాయకుడైన మున్వర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన కొంతకాలం క్రితం వైసీపీలో చేరారు. మున్వర్ హఠాన్మరణం చెందడంపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ఆయన అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

News March 26, 2024

విజయనగరం: మంటల్లో పడి మహిళ మృతి

image

ప్రమాదవశాత్తు మంటల్లో పడి ఓ మహిళ మృతి చెందిన విషాదకర ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొత్తబగ్గాం గ్రామానికి చెందిన ఎస్.బంగారమ్మ(45) ఆదివారం పొలంలో ఉన్న పిచ్చి మొక్కలను ఏరి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమెకు మూర్చరావడంతో మంటల్లో పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News March 26, 2024

ఏప్రిల్‌ 1న ఇఫ్తార్ విందుకు సీఎం జగన్‌ రాక

image

రంజాన్‌ మాసం సందర్భంగా కదిరిలో ముస్లిం మైనార్టీల కోసం ఏప్రిల్‌ 1న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను పరిశీలించేందుకు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం సోమవారం కదిరికి విచ్చేశారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌తో కలిసి కదిరి-మదనపల్లి రోడ్‌లోని పీవీఆర్‌ ఫంక్షన్‌ హాలును పరిశీలించారు.

News March 26, 2024

కర్నూలు: బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ జ్యోతి అభ్యర్థుల వివరాలను సోమవారం వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో నంద్యాల నుంచి రమణ, నందికొట్కూరు నుంచి లాజర్, ఆళ్లగడ్డ నుంచి అన్నమ్మ, పాణ్యం నుంచి చిన్న మౌలాలి, డోన్ నుంచి రాముడు, ఆలూరు నుంచి రామలింగయ్య పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

News March 26, 2024

శ్రీకాకుళం: ఇసుక లారీ ఢీకొని సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

image

పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ వెనుక చక్రాల కింద సోంపేట మండలం జీడీపుట్టుక గ్రామానికి చెందిన చెల్లురి చైతన్య తీవ్ర గాయాలపాలయ్యాడు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడు ఇటీవల సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 26, 2024

ఉమ్మడి విశాఖలో కూటమి సీట్ల పంపకాలు ఇలా..!

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని TDP-9, జనసేన-4, BJP-2 స్థానాల్లో పోటీ చేయునున్నట్లు తెలుస్తోంది. అరకు, మాడుగుల, చోడవరం, విశాఖ ఈస్ట్, వెస్ట్, గాజువాక, పాయకరావుపేట, నర్సీపట్నంలో TDP అభ్యర్థులను ప్రకటించగా..భీమిలి కూడా TDPకే ఇవ్వనున్నట్లు సమాచారం. అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలిలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. విశాఖ సౌత్‌ సీటు ఆశిస్తుంది. అటు BJPకి విశాఖ నార్త్, పాడేరు సీట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.