Andhra Pradesh

News March 26, 2024

ప్రకాశం : చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు

image

చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పు జరిగింది. తొలుత ఈ నెల 31న మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలలో ప్రజాగళం పేరుతో పర్యటించనున్నారని ప్రకటించగా ..తాజా షెడ్యూలు ప్రకారం చంద్రబాబు కార్యక్రమం మార్కాపురం వరకే పరిమితం కానుంది. ఆ రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో జరిగే సభలో పాల్గొని అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్లో మార్కాపురం చేరుకొని సభలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

News March 26, 2024

కోవూరు : అమ్మకు అండగా అర్జున్ రెడ్డి

image

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజకీయ వ్యవహారాలలో ఆమె కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. నెల్లూరులోనే మకాం వేసి పాత పరిచయాలు, బంధుత్వాలను సమన్వయం చేసుకుంటూ పలువురు నేతలను వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

News March 26, 2024

పిఠాపురంలోనే పవన్ ‘ఉగాది’ వేడుకలు!

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార శంఖారావానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 30న పిఠాపురంలోని శ్రీపురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, ‘వారాహి’కి పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టనున్నారు. 3 విడతల్లో పవన్ ప్రచారం సాగనుంది. మొదటి 3 రోజులు పిఠాపురంలోనే ఉండి సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత జనసేన బరిలో ఉన్న ప్రాంతాలకు ప్రచారానికి వెళ్తారు. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే జరుపుకోనున్నారు.

News March 26, 2024

పాలకొల్లులో బీజేపీ నేత కారు ధ్వంసం

image

ఇంటి ఆవరణలో పార్కింగ్‌ చేసిన తన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పాలకొల్లుకు చెందిన బీజేపీ నాయకుడు రావూరి సుధ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 22న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద కారు పార్కింగ్‌ చేశామన్నారు. మరుసటిరోజు ఉదయం చూసేసరికి వెనుక భాగంలో అద్దం పూర్తిగా ధ్వంసమై ఉందన్నారు. పార్కింగ్‌ స్థలంలో వరుసగా కార్లు ఉన్నా తన కారునే టార్గెట్‌ చేసి ధ్వంసం చేశారన్నారు.

News March 26, 2024

విజయనగరం ఎంపీ సీటు.. ఐవీఆర్ఎస్‌లో ఆ ముగ్గురి పేర్లు..!

image

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.

News March 26, 2024

విశాఖ: వన్యప్రాణుల వరుస మరణాలతో గుబులు

image

విశాఖ జంతు ప్రదర్శన శాలలో వన్యప్రాణుల మృత్యువాత ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చనిపోతుండడం జూలో కలకలం రేపుతోంది. కార్డియో పల్మనరీ వ్యవస్థ విఫలమవ్వడంతో తాజాగా జిరాఫీ మృతి చెందింది. గత నెలలో ఆడ చింపాంజీతో కలుపుకొని కొద్ది నెలల్లోనే ఎనిమిది వరకు చనిపోయాయి. వరుసగా చోటుచేసుకుంటున్న వీటిని చూస్తుంటే జంతువుల సంరక్షణపై అనుమానం కలుగుతోంది. నిజంగా వాటి మృతికి వయసు మీరడమే కారణమా అన్నది సందేహంగా మారింది.

News March 26, 2024

గుంటూరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

సరుకు రవాణాలో గుంటూరు రైల్వే డివిజన్ రికార్డు సృష్టించింది. 2013-14లో ఉన్న అత్యధిక లోడింగ్ 3.127 మిలియన్ టన్నులను సోమవారం అధిగమించి సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. 2003లో డివిజన్ ప్రారంభించిన తర్వాత తొలిసారి గరిష్ఠ స్థాయి రికార్డ్ నమోదు చేసుకుంది. దీంతో అధికారులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే అధికారి రామకృష్ణ ఉన్నతాధికారుల ప్రశంసలందుకున్నారు.

News March 26, 2024

వైసీపీకి 10 సీట్లకు మించి రావు: బైరెడ్డి

image

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి 10 అసెంబ్లీ సీట్లకు మించి రావని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని తెదేపా కార్యాలయంలో సోమవారం నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని, మన రాష్ట్రంలో అంతకంటే ఎన్నో రెట్ల మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు.

News March 26, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ పై కేసు నమోదు

image

కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంలో సోమవారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామానికి చెందిన వాలంటీరు పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా భావిస్తూ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకు ఎంపీడీవో రామాంజనేయులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2024

వీరపనేనిగూడెం వద్ద ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

image

గన్నవరం మండలంలో వీరపనేని గూడెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిరిపల్లి నుంచి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిగా, 18 మందికి గాయాలయ్యాయి. ఆగిరిపల్లి నుంచి కూలీలు తీసుకొస్తున్న ఆటో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.