Andhra Pradesh

News March 25, 2024

తూ.గో.: జాతరలో కత్తిపోట్లు.. బాలుడు మృతి

image

తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం వెంకటరెడ్డిపేటలో సోమవారం జరిగిన జాతరలో 2వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఇందులో రాంగోపాలపురానికి చెందిన సాయికుమార్(16) మృతిచెందాడని పోలీసులు తెలిపారు. జాతరలో భద్రాచలం, రాంగోపాలపురం గ్రామానికి చెందిన యువకులు రెండు వర్గాలుగా విడిపోయి దెబ్బలాడుకున్నారు. భద్రాచలం యువకులు కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సాయికుమార్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. 

News March 25, 2024

ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకే: మీనాక్షి నాయుడు

image

పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే సీటు BJPకి కేటాయిస్తున్నారనే మీడియాలో ప్రచారం జరగడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మీనాక్షినాయుడు నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దయచేసి మీడియాలో వచ్చిన కథనాలను నమ్మొద్దని.. ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదని తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

News March 25, 2024

రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఘనంగా డోలోత్సవం

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో డోలోత్సవం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రామస్వామి ఆలయంలోని గోవిందరాజ స్వామి, సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను కొండ వద్ద ఉన్న మండపం వద్దకు అర్చకులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, డోలోత్సవం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News March 25, 2024

రెంటచింతల: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తరలి వ్యక్తి మృతి చెందిన ఘటన రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంట మణికంఠ రెడ్డి (32) తన ఇంటి ఎదురుగా ఉన్న విద్యుత్ మోటారు పట్టుకోగా షాక్ తగిలి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News March 25, 2024

వేంపల్లె: కత్తులతో పొడుచుకున్న నలుగురు యువకులు

image

వేంపల్లె మండలం గండి రోడ్‌లో ఆదివారం సాయంత్రం మద్యం తాగిన మత్తులో నలుగురు యువకులు విచక్షణా రహితంగా కత్తులతో పొడుచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఇద్దరికి పొట్టభాగంలో, మరొకరికి కాలి తొడభాగంలో తీవ్ర గాయాలయి రక్తస్రావం జరుగుతుందని సర్జరీ చేయాలని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2024

శ్రీకాకుళం: రూ.రెండు లక్షల నగదు, కారు సీజ్

image

సరుబుజ్జిలి మండలం అమృతలింగానగరం వద్ద కారులో తరలిస్తున్న రెండు లక్షల రూపాయల నగదు, కారును సీజ్ చేసినట్లు ఎస్సై బి.నిహార్ తెలిపారు. బూర్జ, సరుబుజ్జిలి మండలాలకు సంబంధించిన 2024 సాధారణ ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్ -1 సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా హిరమండలానికి చెందిన రత్నాల రమ మోహనరావు బిల్లులు లేకుండా తరలిస్తున్న సొమ్మును పట్టుకున్నట్లు ఎస్సై చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

News March 25, 2024

అల్లూరి: చెట్టు నిండా తేనెపట్లే

image

సాధరణంగా జనావాసంలో ఉన్న పెద్ద చెట్లకు 5 వరకు తేనెపట్లు ఉంటాయి. అదే అటవీ ప్రాంతాల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో జనావాసాలను ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు నిండుగా తేనెపట్లే ఉన్నాయి. ప్రతి కొమ్మకూ తేనెపట్లు ఉంటూ.. మొత్తంగా 100కు పైగా తేనెపట్లు ఉండటం విశేషం.

News March 25, 2024

జిరాఫీ మృతిపై విశాఖ జూ క్యూరేటర్ వివరణ

image

విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.

News March 25, 2024

తిరుపతి: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు

image

తిరుపతి ఐజర్(IISER)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2 ఖాళీలు ఉన్నాయి. పీజీ ఇన్ లైఫ్ సైన్స్ చదివి రెండేళ్ల అనుభవం కలిగిన వాళ్లు అర్హులు. మరిన్ని వివరాలకు www.iisertirupati.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 03.

News March 25, 2024

జిరాఫీ మృతిపై విశాఖ జూ క్యూరేటర్ వివరణ

image

విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.