Andhra Pradesh

News March 25, 2024

తిరుపతి: YCPని వీడిన వారికి జాక్‌పాట్..!

image

YCP చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానంద రెడ్డిని ప్రకటించడంతో MLA శ్రీనివాసులు జనసేన గూటికి చేరారు. ఆయనకు తిరుపతి MLA టికెట్ ఇచ్చారు. గూడూరు MLA వరప్రసాద్‌కు మరోసారి టికెట్ ఇవ్వడానికి YCP నిరాకరించగా BJPలో చేరారు. తిరుపతి MP టికెట్ దక్కించుకున్నారు. ఈ రెండు సీట్ల కోసం టీడీపీ, బీజేపీలో చాలా మంది సీనియర్లు పోటీ పడినా వీరికే దక్కడం విశేషం. రానున్న ఎన్నికల్లో తిరుపతి ఓటర్లకు సైకిల్ గుర్తు కనపడదు.

News March 25, 2024

నెల్లూరు జిల్లాలో కడప వాసి మృతి

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు సచివాలయ సమీపం వద్ద జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా ఖాజీపేటకు చెందిన వలస కూలీ సురేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

News March 25, 2024

గుడ్లూరులో అగ్ని ప్రమాదం

image

గుడ్లూరు మండలం చిన్నలాటిరఫీలో మల్యాద్రి అనే రైతుకు చెందిన వరిగడ్డి వాము దగ్ధమైంది. ప్రమాదవశాత్తు వరి గడ్డి వాముపై నిప్పు రవ్వలు పడడంతో పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా వరిగడ్డి వాము మొత్తం కాలిపోయింది. సుమారు రూ.25 వేలు విలువైన వరిగడ్డివాము దగ్ధమైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 25, 2024

పనబాకకు టికెట్ లేనట్లే..!

image

కావలికి చెందిన పనబాక లక్ష్మి నెల్లూరులో మూడు సార్లు, బాపట్లలో ఒకసారి MPగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత TDPలో చేరారు. 2019, 2021లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె తిరుపతి, బాపట్లలో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆ రెండు చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. దీన్ని ఆమె ఖండించారు.

News March 25, 2024

శ్రీకాకుళం: ‘గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్’

image

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పాతపట్నం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని మోహన బ్లాక్ పరిధిలోని అడవ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పాతపట్నం నుంచి హైదరాబాద్ కేంద్రానికి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా వారు చిక్కారు. వారి నుంచి సుమారు రూ.1,20,000/- విలువ గల 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News March 25, 2024

నరసాపురంలో MPగా గెలుపు ఎవరిది ?

image

నర్సాపురం రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు నరసాపురం ఉమ్మడి అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజు పోటీలో ఉంటారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు ఆ పార్టీ టికెట్ ప్రకటించింది. దీంతో నరసాపురంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరు ఉమా బాల, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మ బరిలో ఉన్నారు. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరితో వేచి చూడాలి..?

News March 25, 2024

వ్యక్తిగత కారణాలవల్లే అమర్నాథ్ రెడ్డి హత్య: డీఎస్పీ

image

నల్లమాడ మండలం కొట్టాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డిని కేవలం వ్యక్తిగత కారణాలతోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూ.. హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే చంపి ఉండవచ్చన్నారు.

News March 25, 2024

కమలాపురం: తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి 

image

తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి చెందినట్లు ఏపీవో సారధి తెలిపారు. ఏపీవో వివరాల మేరకు.. కమలాపురం మండలం గొల్లపల్లెకు చెందిన గురివిరెడ్డిగారి గంగిరెడ్డి కాల్వ పనులు చేస్తుండగా అక్కడే ఉన్న తేనెటీగలు ముక్కుమ్మడిగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు 108 ద్వారా హాస్పిటల్ కు తరలించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆయన తెలిపారు.

News March 25, 2024

అన్నం పెట్టిన ఇంటికే సున్నం.. రూ.7.50 లక్షల చోరీ?

image

ప.గో జిల్లా ఆకివీడులోని మందపాడుకి చెందిన దుర్గాప్రసాద్ ఇంట్లోంచి రూ.7.50 లక్షలు చోరీ అయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 20న ఓ కుర్రాడు తమ వద్దకు వచ్చి అనాథనని, ఆకలేస్తుందని చెప్పాడని, అన్నం పెట్టి తమ వద్దే ఉంచుకున్నట్లు తెలిపారు. ఇంటికి తాళం వేసి బయటకెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగలగొట్టి బీరువాలోని
నగదు కాజేశారని, అప్పటి నుంచే ఆ బాలుడూ కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News March 25, 2024

గుంటూరు: రైలు కింద పడి యువకుడి మృతి

image

రైలు కిందపడి యువకుడు మృతిచెందిన ఘటనపై సోమవారం గుంటూరు GRP పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంబూరు నుంచి రెడ్డిపాలెం వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం ఉందని సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ వెళ్లి పరిశీలించారు. యువకుడి పేరు, వివరాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివరాలు తెలిసిన వాళ్లు GRP పోలీసులను సంప్రదించాలన్నారు.