India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, మూడు గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలి. ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లను https:/apdsc.apcfss.in అప్లోడ్ చేయాలన్నారు
బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసులు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. శ్రీనివాసులు 1985లో అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో చేరి కళాశాల కార్యదర్శిగా పనిచేశారు. 1990లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అనంతరం బీజేపీలో చేరారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా 2సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
విశాఖ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా కమిషనర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో తీవ్ర గాయాల పాలైన వారికి రూ.50 వేలు చొప్పున ఆరుగురికి రూ.3 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. విశాఖలో ఇప్పటి వరకు 69 మంది రోడ్డు ప్రమాద భాదితులకు సహాయక కేంద్రం ద్వారా రూ.55.50 లక్షలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
కానిస్టేబుల్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ విశాలాక్షి నగర్ ఏఆర్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించారు. 659 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 627 మంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని, మిగతా 32మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉందని అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్‌రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు 70 మందిలో 69 మంది హాజరు కాగా ఒకరు హాజరు కాలేదు.
డీఎస్సీ-25కు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మొద్దని నెల్లూరు DEO బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో పోస్టులు భర్తీ కొరకు కాల్ లెటర్ అందిన అభ్యర్థులు వ్యక్తిగతంగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు కుల ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లు జిరాక్స్, గెజిటెడ్ అటిస్ట్రేషన్తో పాటు 5 ఫోటోలు తీసుకురావాలని కోరారు.
కడప జిల్లాలో ఎక్కడైనా యూరియా కొరత ఉంటే 24 గంటల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం యూరియా లభ్యతపై JC అధితిసింగ్, DAO చంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతుల అవసరాలకు తగినంత యూరియా స్టాక్ ఉందన్నారు. ఒక ఎకరాకు ఒక బస్తా సరిపోతుందన్నారు. కావల్సినంత మాత్రమే వినియోగించాలని, యూరియా విషయంలో దళారులు తప్పుదోవపట్టిస్తే చర్యలు తప్పవన్నారు.
వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. అయితే, ఈ అనుమతుల కోసం ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిబంధనలను ఆయన శుక్రవారం ప్రకటించారు. విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
శుక్రవారం విడుదలైన మెగా DSC ఫలితాల్లో తిరుపతి జిల్లా యువకుడు సత్తా చాటాడు. ఎర్రవారిపాలెం మండలం ఓఎస్ గొల్లపల్లికి చెందిన ముండ్రే శేషాద్రి ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ☞ S.A SOCIAL-80.63(9ర్యాంక్) ☞ SGT-86.33( 53ర్యాంక్) ☞ S.A తెలుగు -73.05(42ర్యాంక్) ☞ T.G.T తెలుగు -71.00(127ర్యాంక్) ☞ T.G.T SOCIAL-70.93(82ర్యాంక్) సాధించాడు. ఈ మేరకు ఆయన్ను పలువురు అభినందించారు.
జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించారు. హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికులుగా, నవలా రచయితగా, కథా రచయితగా, వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా, సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించారు. ఆంధ్రప్రభలో సబ్‌ఎడిటర్‌గా, రాడికల్ డెమోక్రాట్, విహారి, దేశాభిమాని, విజయప్రభ పత్రికలలో ఎడిటర్‌గా పనిచేశారు. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయంలో పీహెచ్డీ పొందారు. 1978 ఆగష్టు 23న మరణించారు.
Sorry, no posts matched your criteria.