Andhra Pradesh

News March 25, 2024

గుమ్మనూరు జయరామ్‌కు మూడో జాబితాలో మొండిచేయి

image

టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో గుమ్మనూరు జయరామ్‌కు చోటు దక్కలేదు. గుంతకల్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు ఐవీఆర్ఎస్ సర్వేలో అనుకూలత లేదని సీటు నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే గుంతకల్లులో పార్టీ కార్యాలయం స్థాపించి గుమ్మనూరు సోదరులు ప్రచారాలు సైతం నిర్వహించారు. అయితే అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

News March 25, 2024

ఏర్పేడు : JRFకు దరఖాస్తులు ఆహ్వానం

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ జనరల్ కెమిస్ట్రీ/ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, గేట్, నెట్ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 10.

News March 25, 2024

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

image

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.  2004లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పరాజయాల అనంతరం బీజేపీలో చేరారు.

News March 25, 2024

ఏలూరులో ట్రావెల్స్ బస్సు- లారీ ఢీ

image

ఏలూరులోని రామచంద్ర కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం యాక్సిడెంట్ జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో స్థానిక ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2024

27న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 27న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన పర్యటన సాగనుంది. ఈ మేరకు సమాచారం రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.

News March 25, 2024

గ్రేట్.. ‘కిలిమంజారో’పై కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణి

image

ఉన్నత ఉద్యోగం.. బిజీ షెడ్యూల్.. అయినా పర్వతారోహణపై ఆసక్తితో ఆఫ్రికాలోనే అతి ఎత్తైన కిలిమంజారోను అధిరోహించారు కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణి ఎస్.భరణి. ఈమె స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. 9Th క్లాస్‌లో కొడైకెనాల్‌కు స్టడీటూర్‌ వెళ్లగా.. అక్కడి కొండలు, సరస్సులు చూశాకే తనకు కొండలెక్కాలన్న ఆసక్తి మొదలైందని భరణి చెబుతున్నారు. ఈమె 2018లో ఫారెస్ట్ ఆఫీసర్ నరేంద్రన్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

News March 25, 2024

అనిల్… ఆ సెంటిమెంట్ ను కొనసాగించేనా?

image

నెల్లూరు నేతలు ఎక్కడైనా నెగ్గుకొస్తారనే పేరుంది. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నరసారావుపేట, విశాఖ, బాపట్ల MPగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు, నరసారావుపేట MPగా, పనబాక లక్ష్మి బాపట్ల MPగా విజయం సాధించారు. ఒంగోలు ఎంపీగా గతంలో బెజవాడ పాపిరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మ, ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఈఎన్నికల్లో నరసారావుపేట నుంచి పోటీ చేస్తున్న అనిల్ అదృష్టం ఎలా ఉందో.

News March 25, 2024

దర్శిలో వీడని ఉత్కంఠ?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయింది. కూటమి నుంచి ఒక్క దర్శి మినహా. దీనికి ప్రధానం కారణం పొత్తులో ఇక్కడ ఏ పార్టీకి సీటు కేటాయించాలన్నది పెను సవాలుగా మారింది. అటు టీడీపీ నుంచి బాచిన కృష్ణ చైతన్య, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు పోటీలో ఉండగా, జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు. దీంతో ఎవరికీ సీటు ఇచ్చి ఎవరిని బుజ్జగిస్తారో అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

News March 25, 2024

విశాఖ ఇందిరాగాంధీ జూలో జిరాఫీ మృతి

image

విశాఖ ఇందిరాగాంధీ పార్కులో సోమవారం తెల్లవారుజామున జిరాఫీ మృతి చెందింది. గతంలో రెండు జిరాఫీలు ఉండేవి. అందులో ఒకటి ఇప్పటికే మృతి చెందగా ఈరోజు మరో జిరాఫీ మృతి చెందింది. దీంతో జూ పార్క్‌లో ఉన్న జిరాఫీల ఎన్‌క్లోజర్  ఖాళీ అయింది. జంతువుల వరుస మరణాలతో జూ పార్క్ వెలవెలబోతోందని జంతు ప్రేమికులు అంటున్నారు. అధికారుల తగు జాగ్రత్తలు తీసుకొని జంతువులను కాపాడాలని కోరుతున్నారు. 

News March 25, 2024

శ్రీ సత్యసాయి: పసికందుకు ఓకే రోజు 3 వ్యాక్సిన్‌లు.. మృతి

image

రొళ్ల మండలం దొడ్డేరి పంచాయతీలో ANM, వైద్యుల నిర్లక్ష్యం పసికందు(నెల)ను బలి తీసుకుంది. పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లు గ్రామానికి చెందిన రాధమ్మ, దొడ్డ హనుమ దంపతులకు జన్మించిన పసికందుకు ANM వరలక్ష్మి ఈనెల 23న 3 వ్యాక్సిన్‌లు వేశారు. అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున పసికందు మరణించింది. తమ బిడ్డ మరణానికి ANM, వైద్యులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.