Andhra Pradesh

News March 25, 2024

పుత్తూరు: రైలు కింద పడి అర్చకుడు మృతి

image

ప్రమాదవశాత్తు రైలు కింద పడి పుత్తూరుకు చెందిన పురోహిత్ మూర్తి మృతి చెందిన ఘటన ఆదివారం చెన్నైలో జరిగింది. పుత్తూరులోని శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరాలయ ఆవరణలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ అర్చకుడు మూర్తి(58) ఆదివారం ఓ పూజ నిమిత్తం సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లారు. చెన్నై పరిధిలోని ఆంబూరు రైల్వేస్టేషన్లో రైలు దిగి కదులుతున్న మరో రైలు ఎక్కేక్రమంలో అదే రైలు కిందపడి మృతి చెందాడు.

News March 25, 2024

ప్రకాశం: వివాహితను కత్తితో బెదిరించి లైంగికదాడికి యత్నం

image

ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై వ్యక్తి బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన కొప్పరపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొప్పరపాలెంలో ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన వల్లెపు నాగేశ్వరరావు కత్తితో బెదిరించి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ఎదురు తిరిగి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చేసరికి పారిపోయాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

News March 25, 2024

కర్నూలు: పోక్సో కేసు నమోదు

image

కర్నూలుకు చెందిన లతీఫ్ అనే వ్యక్తిపై 2టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భార్యతో పాటు 8మంది ఆడ సంతానం కలిగిన ఇతను ఈనెల 1న 16 ఏళ్ల బాలికను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. దీంతో తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విషయం తెలిసి ఈనెల 21న బాలికను తిరిగి కర్నూలుకు తీసుకువచ్చాడు.

News March 25, 2024

కాకినాడలో వ్యభిచార గృహంపై దాడి.. కేసు

image

కాకినాడ పట్టణ పోలీసులు ఆదివారం ఓ వ్యభిచార గృహంపై దాడిచేసి యువతి, నలుగురు వ్యక్తులతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జె.రామారావుపేటలోని జెండాసెంటర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. విటులు, ఓ యువతి, నిర్వాహకులను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రూ.6,735 నగదు, 7 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

News March 25, 2024

లవ్ మ్యారేజ్.. మరో ఎఫైర్ పెట్టుకొని భార్యకు వేధింపులు

image

భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై ఉండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉండికి చెందిన సూరిబాబు, జ్యోతి 2011లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా చెడు వ్యసనాలకు బానిసైన సూరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని భార్య ఆదివారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 25, 2024

అన్నమయ్య: అన్న ఎంపీగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ

image

రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన కిరణ్, కిషోర్‌లు తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. AP అసెంబ్లీ స్పీకర్, CMగా కిరణ్ బాధ్యతలు నిర్వర్తించారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో పీలేరు అసెంబ్లీ స్థానానికి కిషోర్, రాజంపేట MP స్థానానికి కిరణ్ పోటీ పడుతున్నారు.

News March 25, 2024

టీడీపీలోకి కోవూరు ఎంపీపీ భర్త

image

కోవూరు మండల పరిషత్ అధ్యక్షురాలు పార్వతి భర్త చంద్ర తెలుగుదేశం పార్టీలో చేరారు. వేగూరుకు చెందిన చంద్ర ఆదివారం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు.

News March 25, 2024

శ్రీకాకుళం: విద్య అందరికీ అందుబాటులో ఉండాలి

image

విద్యారంగంలో లౌకిక భావజాలం అవసరమని, విద్య అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించాలని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో అప్పారి వెంకటస్వామి 23వ వర్ధంతి సందర్భంగా విద్యారంగం-లౌకిక భావజాలం అనే అంశంపై సదస్సు ఆదివారం నిర్వహించారు. సమాజంలో ఉత్పత్తి క్రమం ప్రారంభించి 12 వేల సంవత్సరాలు మాత్రమే అయిందన్నారు.

News March 25, 2024

అనంత: 25న మూల్యాంకనానికి హాజరుకావాలి:

image

ఈ నెల 26, 28వ తేదీన జరగాల్సిన ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం 25న నిర్వహిస్తున్నట్లు డీవీఈవో వెంకట నాయక్ తెలిపారు. 26న రసాయన శాస్త్రం, చరిత్ర 28న బాటనీ, జువాలజీ, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకనం జరగాల్సి ఉండగా ఆయా సబ్జెక్టులను 25నే నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధ్యాపకులు, అధికారులు హాజరుకావాలని కోరారు.

News March 25, 2024

శ్రీకాకుళం: ఐదో తరగతి ఫలితాలు విడుదల

image

జిల్లాలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024-25 సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆదివారం ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థులు పొందిన మార్కులు, సీట్ల సంఖ్యకు అనుగుణంగా జాబితా రూపొందించామని జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ తెలిపారు. జిల్లాలో గల 8 అంబేడ్కర్ గురుకులాల్లో 640 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.