Andhra Pradesh

News March 24, 2024

విజయనగరం: ఆ రెండు స్థానాల్లో వీడని ఉత్కంఠ..!

image

విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్తుందనే ప్రచారం సాగింది. తాజాగా విజయనగరం సీటు టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఒకరైన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇప్పటికే చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు సమాచారం.

News March 24, 2024

ఎమ్మిగనూరులో 29న సీఎం జగన్ ‘మేము సిద్ధం’ సభ

image

ఎమ్మిగనూరులో ఈనెల 29న సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, MLC మధుసూదన్, కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య, ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక తెలిపారు. YWCS గ్రౌండ్‌లో సాయంత్రం మేము సిద్ధం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

News March 24, 2024

ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు పాటించాలి:కలెక్టర్

image

సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలక్టరేట్‌లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కో ఆర్డినేషన్ సెక్షన్, లీగల్ సెల్, మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగం, సువిధ పోర్టల్ విభాగాన్ని అందుబాటులో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులు గురించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

News March 24, 2024

చిగుళ్ల సుమలతను అభినందించిన పల్నాడు కలెక్టర్

image

నవ యువతరం ఫౌండేషన్ సేవాసంస్థ అధినేత, ఫౌండర్ చిగుళ్ల సుమలతను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అభినందించారు. సేవా సంస్థ ద్వారా సమాజానికి అందించిన సేవలకు, వివిధ రంగాలలో కనపరిచిన ప్రతిభను చూసి ఆమెకు ఉమెన్స్ వరల్డ్  రికార్డ్సు అండ్ అవార్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉత్తరప్రదేశ్ ఉమెన్ ఐకాన్-2024 అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మెరుగైన సేవలు ఇంకా సమాజానికి అందించాలని కలెక్టర్ అన్నారు.

News March 24, 2024

నెల్లూరు: వీఆర్‌సీలో హోలీ సంబరాలు

image

నెల్లూరు పట్టణం వీఆర్‌సీ మైదానంలో హోలీ పండుగ సంబరాలు జరిగాయి. పట్టణంలోని యువతీ యువకులు రంగులు చల్లుకుని ఉత్సాహంగా డాన్స్‌లు వేశారు. నీటి పైపుల ద్వారా నీటిని ఆకాశంలోకి వర్షంలా వెదజల్లి డాన్స్ లు చేశారు. యువత కేరింతలతో మైదానం దద్దరిల్లింది. మంచి నీటి ఏర్పాటు, రంగుల ఏర్పాట్లు ముందుగా సిద్ధం చేసుకొని హోలీ జరుపుకున్నారు.

News March 24, 2024

బొబ్బిలి: పవన్‌ను కలిసిన రంగారావు

image

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజయ కృష్ణ రంగారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మతో పాటు మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

News March 24, 2024

గుంటూరు: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన దొప్పలపూడి రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దొప్పలపూడి రాజేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన మృతికి ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోటు రాసి మరణించాడు.

News March 24, 2024

శ్రీ సత్యసాయి: మహిళల ఆత్మహత్య

image

బత్తలపల్లి మండలం కోడకండ్లకు చెందిన పూర్ణ వర్ధిని(17) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్ణ వర్ధిని మదనపల్లి MJR పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. 3 నెలల క్రితం ఆరోగ్యం సరిగా లేదని చెప్పి కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చికిత్స పొందుతోంది.

News March 24, 2024

రాష్ట్ర వైసీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అలీ

image

పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన షేక్ మహమ్మద్ ఆలీని రాష్ట్ర వైసీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి మహమ్మద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

News March 24, 2024

ఎన్నికల సంఘం నిబంధనలు అమలు చేయాలి: ఎస్పీ

image

జిల్లాలోని పోలీసు అధికారులందరూ ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెక్పోస్టుల్లో నగదు, అక్రమ మద్యం, గంజాయి రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు.