Andhra Pradesh

News March 24, 2024

పిఠాపురం: పవన్ కళ్యాణ్‌ను కలిసిన వర్మ

image

పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. వర్మను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.  

News March 24, 2024

తిరుమల: రేపే రూ.300 టికెట్ల విడుదల

image

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూన్ నెల రూ.300 ప్రత్యేక దర్శన కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.

News March 24, 2024

నంద్యాల MP బరిలో వైఎస్ షర్మిల?

image

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నంద్యాల నుంచి MPగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ, మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉండడంతోపాటు అప్పటి కాంగ్రెస్ హాయంలో ఆమె తండ్రి దివంగత CM వైఎస్ రాజశేఖర రెడ్డికి భారీ మెజారిటీ అందించిన స్థానాల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం ఒకటి. ఉమ్మడి జిల్లాలో అప్పటి కాంగ్రెస్ నేతలను ఆమె మళ్లీ పార్టీలోకి వచ్చేలా ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

News March 24, 2024

పల్నాడు: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వాలంటీర్‌పై వేటు

image

కారంపూడి మండలంలోని కారంపూజీ-2లో వాలంటీర్‌గా పని చేస్తున్న షేక్. మజూజి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫొటోలు, వీడియోలు స్టేటస్‌గా పెట్టడం వల్ల, అతడ్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టు మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 24, 2024

తిరుపతి ఎంపీగా గూడూరు MLA..?

image

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు బీజేపీలో చేరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ ఆయనకు సీటు నిరాకరించింది. బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి ఎంపీ సీటు రేసులో ఉన్నారు.

News March 24, 2024

ధర్మవరం MLA అభ్యర్థిగా సత్య కుమార్..?

image

పొత్తులో భాగంగా ధర్మవరం MLA అభ్యర్థిగా BJP జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై నేడో రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే సీటును TDP నుంచి పరిటాల శ్రీరాం, బీజేపీ నుంచి వరదాపురం సూరి ఆశించారు. వైసీపీ అభ్యర్థిగా మరోసారి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి బరిలో దిగుతున్నారు. సత్యకుమార్‌ అయితేనే కేతిరెడ్డిపై గెలవగలరని భావించి ఆయన్ను బరిలో దింపుతున్నట్లు సమాచారం.

News March 24, 2024

జియ్యమ్మవలసలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం

image

జియమ్మవలస మండలం ఇటిక పంచాయతీ ఇటిక గదబవలస గ్రామ శివారులోని తోటపల్లి కుడి కాలువ నుంచి, గుర్తు తెలియని  మృత దేహం కొట్టుకొని వచ్చిందని పోలీసులు తెలిపారు. అతని వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి తెలియజేయాలని కోరారు.

News March 24, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని డిగ్రీ (2020- 21 బ్యాచ్) విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 18 వరకు ఈ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం స్పష్టం చేసింది.

News March 24, 2024

తిరుపతి ఎంపీ రేసులో గూడూరు ఎమ్మెల్యే

image

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు బీజేపీలో చేరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ ఆయనకు సీటు నిరాకరించింది. బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి ఎంపీ సీటు రేసులో ఉన్నారు.

News March 24, 2024

కడప: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ

image

దువ్వూరు మండలంలోని ఇడమడక మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి బాల పెద్దన్నకు చెందిన 20 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన లారీ నిలుపకుండా పోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద గుర్తింపుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.