India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి (1872 ఆగష్టు 23 – 1957 మే 20) గుంటూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నదిపై ప్రకాశం బారేజి నిర్మాణం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన,2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రముఖమైనవి.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించని జిల్లాలోని 29 MEOలకు DEO బాలాజీ రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఫేస్ రికగ్నైజ్ యాప్(FRS)లో హాజరు నమోదు చేసుకోవాలి. అయితే అందుకు భిన్నంగా వారు హాజరు నమోదు చేసుకోకపోవడంతో సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.
మండల స్థాయిలో MRO, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ప్రకటించారు. దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, RSKలను తనిఖీ చేయిస్తామన్నారు. షాపులకు సరఫరా అయిన ఎరువులు, పంపిణీ, నిల్వలపై వారం రోజుల్లో తమకు నివేదికను అందజేయాలని ఆదేశించారు. పక్కదారి పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం మిల్లులో నిల్వ చేసిన టన్నుల ఊక ఒక్కసారిగా కార్మికుడు వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇదే గ్రామానికి చెందిన వాడిని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో 151 అంశాలు చర్చకు రాగా 84 ప్రధాన అజెండా, 67 టేబుల్ అజెండాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశానికి మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్, శాసనసభ్యులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు. జీరో అవర్‌లో వార్డుల్లోని సమస్యలు చర్చించగా, వాటి పరిష్కారానికి మేయర్ హామీ ఇచ్చారు.
ఈనెల 26న జాతీయ మహిళా కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజుందార్ దీనికి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ మహిళా కమిషన్‌కి వినతులు ఇవ్వాలని కోరారు.
గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శుక్రవారం దవళేశ్వరం కాటన్ బ్యారేజీని సందర్శించారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌తో కలిసి వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నందున బ్యారేజీ వద్ద సందర్శకులను నియంత్రించాలని, పోలీసు భద్రతను పెంచాలని అధికారులను ఐజీ ఆదేశించారు. సీఐ టి. గణేశ్ ఉన్నారు.
ప్రకాశం జిల్లాలో అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచేవారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కేసు నమోదుచేస్తామన్నారు.
జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడినంత స్టాకు సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖామంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వారికి కలెక్టర్ వివరించారు.
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి దశ నుంచే సునీల్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేసి అనేక పోరాటాలను చేశారు. సునీల్ రెడ్డి నియామకం పట్ల జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో మంచి స్థానం ఉంటుందని అన్నారు.
Sorry, no posts matched your criteria.