Andhra Pradesh

News March 24, 2024

IT కంపెనీలో జాబ్.. గంజాయి విక్రయం

image

ఐటీ కంపెనీలో పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలానికి చెందిన యాపుగంటి ఫణికుమార్‌ను మాదాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఫణికుమార్ మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ జల్సాలకు అలవాటు పడి, డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి 18కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇతడు మాదకద్రవ్యాలు అమ్ముతూ గతంలోనూ పట్టుబడ్డాడు.

News March 24, 2024

సర్వేపల్లిలో బావ.. కోవూరులో బావమరిది 

image

కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావబావమరుదులు. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేనల్లుడు. మేనమామ వద్దే సోమిరెడ్డి రాజకీయ ఓనమాలు దిద్దారు. 2009 ఎన్నికల వరకు సోమిరెడ్డి, ప్రసన్న ఇద్దరూ టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత సోమిరెడ్డి టీడీపీలోనే కొనసాగుతుండగా, ప్రసన్న వైసీపీలో చేరిపోయారు.

News March 24, 2024

అనంతంపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవ్వరు..?

image

వైసీపీ ఎంపీ అభ్యర్ధులుగా హిందుపురానికి బోయ శాంతమ్మ, అనంతపురానికి శంకర్ నారాయణను ఖరారు చేసింది. టీడీపీ మూడో జాబితాలో హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థ సారథికి అవకాశం కల్పించింది. ఈ నేపధ్యంలో అనంతపురం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ జిల్లాలో నెలకొంది. టీడీపీ అధిష్ఠానం 2019లో పోటీ చేసిన జేసీ పవన్ కుమార్ రెడ్డి వైపు మెగ్గు చూపుతుందా.. లేదా ఇతరుకుల అవకాశం కల్పిస్తుందా.. మీ అభిప్రాయం చెప్పండి.

News March 24, 2024

కడప: వైసీపీ నాయకుడిపై కేసు నమోదు

image

కడప 3వ డివిజన్ వైసీపీ ఇన్‌ఛార్జ్ సుదర్శన్‌రెడ్డిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. డివిజన్‌లో ఒక హోటల్‌ను వైసీపీ నాయకులచే ప్రారంభించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెలూన్లు వైసీపీ జెండా రంగులను పోలి ఉన్నాయని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేసి రూ.10వేలు అపరాధ రుసుం విధించారు. ఈ క్రమంలో జరిగిన వాదులాటలో ఆర్‌ఓ ఆదేశాల మేరకు ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 24, 2024

నంద్యాల: టీడీపీలో చేరిన చల్లా కుటుంబ సభ్యులు

image

బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు, అవుకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ చల్లా విజయ భాస్కర్ రెడ్డి, ఆయన బావమరిది కాశీపురం మెట్ల రామిరెడ్డి టీడీపీలో చేరారు. అమరావతిలోని చంద్రబాబు స్వగృహం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

News March 24, 2024

REWIND: చంద్రగిరిలో TDP ఓటమికి కారణం అదే..!

image

చంద్రబాబుతో విభేదించి ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. చిత్తూరు ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. దీంతో చంద్రగిరి నుంచి ఇండిపెండెంట్‌ MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ MLAగా 14,392 ఓట్ల మెజార్టీతో గెలిచారు. TDP అభ్యర్థి రామనాథం నాయుడుకు 32,2446 ఓట్లు పడ్డాయి. రామ్మూర్తికి ఏకంగా 31,525 ఓట్లు రావడంతో అక్కడ TDP ఓడిపోయింది.

News March 24, 2024

కృష్ణా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షల టోకరా

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్‌ (40) ఆన్‌లైన్‌ ట్రేడర్‌. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

News March 24, 2024

విశాఖ తీరంలో సోమర్సెట్… బాహుబలి నౌక!

image

భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖతీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.

News March 24, 2024

‘టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగిరేనా’

image

1982లో టీడీపీ స్థాపన అనంతరం నందిగామ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1989లో కాంగ్రెస్, 2019లో వైసీపీ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా టీడీపీ తమ ఇన్‌ఛార్జ్ తంగిరాల సౌమ్యకు టికెట్ ఇవ్వగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్‌ను బరిలోకి దించింది. వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా ఎగురుతుందా, వైసీపీ ఆధిపత్యం చూపునా మీ కామెంట్.

News March 24, 2024

చిత్తూరు: యథావిధిగా బిల్లుల వసూల్లు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు ఆది, సోమవారాలు యథావిధిగా పనిచేస్తాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని కోరారు.