India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి మండలం సింగుమహంతిపేట, రెయ్యిపేట గ్రామాల్లో ఈ నెల 19,20 తేదీల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో గణేష్(27), లోకేశ్వరరావు(37) ఇరువురు శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడి గణేష్ మృతిచెందగా, పురుగులమందు తాగిన లోకేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాకు వెళ్లొద్దంటూ విధించిన షరతులపై స్టే ఇచ్చింది. దీంతో ఆయన నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. మిగిలిన షరతులను యథాతధంగా ఉంచింది.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, డబ్బులు డిమాండ్ చేయడంపై శుక్రవారం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేశ్ బాబు కథనం మేరకు.. కలెక్టర్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులను పరిచయం చేసుకొని డబ్బు అడగడం మొదలుపెట్టాడు. కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తాడేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై మాట్లాడుకున్నారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈవో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఇప్పటికే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి
సముద్ర రంగంలో విశాఖను నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు కోరారు. విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన సదస్సులో మాట్లాడారు. సముద్ర రంగంలో విశాఖ రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోర్టు ఆధారిత తయారీ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోందని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2024కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు మీ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఎరువులను తీసుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం వద్ద సరిపడ స్టాక్ ఉందన్నారు. గ్రామ, మండల వ్యవసాయ అధికారులను, రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలన్నారు.
ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన 47200 అర్జీలను పరిష్కరించినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వివరించారు. ప్రజల అర్జీల పరిష్కారంపై ఒంగోలులోని కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించేలా, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
చాపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.