Andhra Pradesh

News March 22, 2024

VZM: మహిళ MLA అవ్వని నియోజకవర్గాలు ఇవే

image

ఉమ్మడి విజయనగరంలోని మొత్తం 9 నియోజకవర్గాల్లోని సాలూరు, బొబ్బిలి, నెల్లిమర్లలో ఇప్పటి వరకూ మహిళలు ఎమ్మెల్యేగా గెలవలేదు. బొబ్బిలిలో ఇప్పటి వరకూ మహిళా అభ్యర్థి పోటీచేయలేదు. నెల్లిమర్లలో కూడా ఇదే పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లిమర్లలో లోకం మాధవి పోటీచేస్తుంటే, సాలూరు నుంచి సంధ్యారాణి మూడోసారి పోటీచేస్తున్నారు. మరి వీరి గెలుపుపై మీ కామెంట్

News March 22, 2024

కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి సృజన హెచ్చరించారు. శుక్రవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీ విజిల్ ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 22, 2024

పౌరులకు అందుబాటులో ‘సి విజిల్‌’ యాప్‌

image

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ‘సి విజిల్‌’ యాప్‌ ద్వారా ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంగించిన ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

News March 22, 2024

పదో తరగతి పరీక్షలకు 1,385 మంది విద్యార్థుల గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదవ తరగతి పరీక్షలకు 1,385 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. శుక్రవారం జరిగిన మ్యాథ్స్ పరీక్షలో పెనుకొండ సబ్ డివిజన్ నుంచి 791 మంది విద్యార్థులు, ధర్మవరం సబ్ డివిజన్ నుంచి 594 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

News March 22, 2024

ఫిర్యాదుల ప‌రిష్కార నాణ్య‌త‌పై దృష్టిసారించాలి: కలెక్టర్

image

ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. సీ-విజిల్‌, 1950 హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ), క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూం నెంబ‌ర్ (0866-2570051) త‌దిత‌రాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను నాణ్య‌త‌తో, స‌త్వ‌ర ప‌రిష్కారంపై దృష్టిసారించాల‌ని అధికారులకు సూచించారు.

News March 22, 2024

ప.గో.: ఇక్కడ ఇప్పటివరకు హ్యట్రిక్ నమోదు కాలేదు

image

ప.గో. జిల్లాలోని పాలకొల్లులో 1955 నుంచి 2019 వరకు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడూ హ్యాట్రిక్ విజయం నమోదుచేయలేదు. అయితే 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన నిమ్మల రామానాయుడు వరుస విజయాలు సాధించారు. తాజాగా మరోసారి ఆయన అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఈ సారి గెలిస్తే పాలకొల్లు చరిత్రలో హ్యాట్రిక్ రికార్డు ఆయన సొంతమవుతుంది. మరి విజయం సాధించేనా..?

News March 22, 2024

పార్వతీపురం: తండ్రి మృతి.. బరువెక్కిన గుండెతో పరీక్ష

image

గుండెపోటుకు గురై మృతి చెందిన తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదవ తరగతి పరీక్షకు హాజరైన విషాద సంఘటన శుక్రవారం పార్వతీపురం మండలంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన వినయ్ అనే విద్యార్థి తండ్రి ఎన్. సీతారాం(45) శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఇంటి వద్దే మృతి చెందాడు. కుమారుడు వినయ్ పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యాడు.

News March 22, 2024

గన్నవరంలో మాధవిరెడ్డి, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం

image

గన్నవరం YCP కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. TDP నిర్వహించనున్న వర్క్‌షాపులో పాల్గొనేందుకు కడప TDP ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడ వచ్చారు. గన్నవరం మీదుగా వెళ్తూ అక్కడి వైసీపీ కార్యాలయం వద్ద బ్యానర్లను ఫొటోలు తీస్తుండగా ఆ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న TDP కార్యకర్తలు అక్కడకు చేరుకోగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

News March 22, 2024

కుప్పం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి 

image

కుప్పం మండలం బురడ సిద్దనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మురుగేష్ కుమారుడు రాజశేఖర్ ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. మద్యాహ్నం మేకలకు మేత కోసం వెళ్లినప్పుడు పొలం వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు పొరపాటున తగిలి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

News March 22, 2024

కావలి: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

image

కావలి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున రైలు ఢీకొని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ అరుణ పోలీసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ రైలు ట్రాక్‌ను దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఉండొచ్చన్నారు. మహిళ వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. మృతురాలి దేహంపై రోజ్ కలర్ చుడీదార్, వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ చున్నీ ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు.