Andhra Pradesh

News March 22, 2024

అనంత: జిల్లాలో 35,792మందికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం

image

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పలు కారణాలతో మంచానికి పరిమితమైన వారు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్ళు ఆపై వయసున్న వారు 9,799 మంది ఉన్నారు. అందులో పురుషులు 3,873 మహిళలు 5,926 మంది దివ్యాంగ ఓటర్లు 25,993మంది ఉన్నట్లు వెల్లడించారు.

News March 22, 2024

టీడీపీ మూడో లిస్ట్.. కడపలో కొనసాగుతున్న సస్పెన్స్

image

టీడీపీ మూడో జాబితాలోనూ.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కడప, రాజంపేట ఎంపీ స్థానాలు, జమ్మలమడుగు, బద్వేల్, కోడూరు, రాజంపేట ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆ స్థానాల్లో ఆశావాహుల్లో ఉత్కంఠ మరింత పెరిగుతోంది. ఇక జమ్మలమడుగు, బద్వేల్ స్థానాలు బీజేపీకి.. కోడూరు, రాజంపేట ఎమ్మెల్యే స్థానాలు జనసేన ఇచ్చే అవకాశం ఉందని చర్చలు ఊపందుకున్నాయి.

News March 22, 2024

అప్పుడు గల్లా.. ఇప్పుడు పెమ్మసాని

image

టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు ఖరారైంది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించింది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలతో పేరు పొందిన పెమ్మసాని తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోటీ చేయనున్నారు.

News March 22, 2024

శ్రీకాకుళం: ఆ మాజీ MLAకి TDP మూడో జాబితాలో దక్కని చోటు

image

శ్రీకాకుళం నియోజకవర్గానికి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గొండు శంకర్‌ను టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు జరుపుకోగా.. ఈ రోజు వరకు టికెట్ వారికే వస్తుందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమె వర్గం ఆశతో ఉండగా ఆ ఆశలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయాయి. దీనిపై గుండ కుటుంబం, ఆమె సామాజిక వర్గం తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.

News March 22, 2024

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పు

image

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.

News March 22, 2024

ఈ సారి విశాఖ ఎంపీగా నెగ్గేదెవరు?

image

టీడీపీ మూడో జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా భరత్ మరోసారి బరిలో దిగుతున్నారు. అటు వైసీపీ బొత్స ఝాన్సీ పోటీచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రచారం చేస్తుండగా, అధికారిక ప్రకటనతో మరింత ఊపందుకోనుంది. ఈ సారి విశాఖలో ఎవరు నెగ్గుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

TDP లిస్ట్.. అమలాపురం, కాకినాడ సిటీ అభ్యర్థులు వీరే!

image

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. అమలాపురం MLA అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ సిటీ MLA అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్‌.. కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. 2019లోనూ ఈ రెండు చోట్ల వీరే ప్రత్యర్థులు కాగా, ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.

News March 22, 2024

ఉమ్మడి ప.గో నేతల్లో టెన్షన్.. ఆ ‘ఒక్కరు’ ఎవరు..?

image

TDP అభ్యర్థుల మూడో లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలోనూ పోలవరం టికెట్‌పై సందిగ్ధత వీడలేదు. ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కూటమి తరపున సైతం పోలవరం మినహా.. 14 చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, పోలవరం నుంచి మాత్రం ఏ పార్టీ బరిలో ఉంటుంది..? ఎవరు పోటీ చేస్తారు..? అనే ఉత్కంఠ వీడటం లేదు. దీంతో అటు క్యాడర్‌లో టెన్షన్.. ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

News March 22, 2024

టీడీపీ మూడో జాబితా.. ఎస్.కోట అభ్యర్థిగా లలిత!

image

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మూడో జాబితాలో ఎస్.కోట నుంచి కోళ్ల లలిత కుమారికి స్థానం దక్కింది. ఆమె 2009,14లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావుపై ఓడిపోయారు. వైసీపీ నుంచి ఈసారి కూడా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే 2014, 2019లో తలపడిన వీరి మధ్య మరోసారి పోటీ నెలకొంది. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారని మీరు భావిస్తున్నారు. కామెంట్ చేయండి.

News March 22, 2024

పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకుకి ఎంపీ టికెట్

image

కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెట్‌ను కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్‌ను టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి బరిలో నిలిపింది. 13 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఆయనను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.