Andhra Pradesh

News March 22, 2024

కృష్ణా: జడ్పీ సీఈఓ జ్యోతిబసు బదిలీ

image

జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వీర్ల జ్యోతిబసు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరుణంలో సొంత జిల్లాల్లో విధులు నిర్వహించే వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలన్న ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు జ్యోతి బసును బదిలీ చేశారు.

News March 22, 2024

REWIND: నెల్లూరు 90 ఓట్లతో గెలిచారు..!

image

నెల్లూరు MLAలుగా ఇప్పటి వరకు 14 మంది గెలిచారు. ఇందులో తక్కువ మెజార్టీ(90) ముంగమూరు శ్రీధర్ రెడ్డిది కాగా అత్యధిక మెజార్టీ(31,268) కేవీ సుబ్బారెడ్డిది. 2009లో ముంగమూరు PRP తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌‌పై గెలిచారు. 1978లో KV సుబ్బారెడ్డి కాంగ్రెస్.ఐ తరఫున బరిలో నిలిచి జనతా అభ్యర్థి ఆనం వెంకట రెడ్డిపై విజయం సాధించారు. ఈసారి ఈ రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో చూడాలి.

News March 22, 2024

కంచరపాలెం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్‌లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోర సుధాకర్ రెడ్డి (40) తన అన్న సురేశ్ రెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. తనకి వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై అందరితోనూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2024

పార్వతీపురం: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పార్వతీపురానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని దిగాలుగా ఉండడంతో, గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిపాడు. బెటర్ మెంట్‌లో మార్కులు తెచ్చుకోవచ్చని వారు సర్ది చెప్పినా, మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 22, 2024

చేబ్రోలులో 37 మంది వాలంటీర్ల తొలగింపు

image

చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామ సచివాలయాలకు చెందిన 37 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీఓవో కె.జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. వీరంతా ఒక సమావేశానికి హాజరయ్యారని ఆమె తెలిపారు. అనంతరం చేబ్రోలు-1 గ్రామ సచివాలయంకు చెందిన ముగ్గురు, చేబ్రోలు-2కు చెందిన 7గురు, చేబ్రోలు-3కు చెందిన 4గురు, చేబ్రోలు-4కు చెందిన 6గురు, చేబ్రోలు-5కు చెందిన 14మందిని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. 

News March 22, 2024

కోడూరు: విధుల నుంచి వాలంటీర్ తొలగింపు

image

కోడూరు సచివాలయం-2 పరిధిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రబాబును విధుల నుంచి తొలగించినట్లు కోడూరు ఎంపీడీవో ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలలో అతను పాల్గొన్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గురువారం వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో తెలియజేశారు.

News March 22, 2024

తూ.గో జిల్లా పోలీసులకు ‘ఉగాది పురస్కారాలు’

image

తూ.గో జిల్లాలో పలు భద్రతా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గౌరవం దక్కింది. ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజపత్రం గురువారం రాత్రి విడుదల చేశారు. డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్‌ఐ బీవీఆర్‌ వర్మకు ఉత్తమ సేవా పథకం లభించింది. ట్రాఫిక్‌ విభాగంలో కానిస్టేబుల్‌ జే.శ్రీనివాసరావు, కొవ్వూరు పీఎస్‌లో పనిచేస్తున్న హెచ్‌సీ కె.శ్రీనివాసరావు, ఉండ్రాజవరం పీఎస్‌లోని హెచ్‌సీ వై.నాగేశ్వరరావు ఉన్నారు.

News March 22, 2024

కర్నూలు : పాలీసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 ఫీజు చెల్లించి https://polycetap. nic.in ద్వారా వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

News March 22, 2024

అనుమతులు తప్పనిసరి: ఏలూరు ఎస్పీ

image

ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీ అమలులో ఉన్నందున ఏవైనా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, సభలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సువిధ యాప్‌లో పూర్తి సమాచారంతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకే గ్రామంలో ఒకే సమయంలో ఏ రెండు పార్టీలకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతించమని తెలిపారు.

News March 22, 2024

ప్రొద్దుటూరు: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నవ్య అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన నవ్య ఇక్కడ చదువుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.