Andhra Pradesh

News April 15, 2024

CTR: ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. వ్యక్తి మృతి

image

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజుపురం(SRపురం) మండలంలో విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన హిమాచల మందడి తన గానుగ షెడ్ వద్దకు వెళ్లాడు. అక్కడ సెలఫోనుకు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ కుళ్లాయప్ప కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News April 15, 2024

నెల్లూరు వద్ద ముగ్గురు శ్రీకాకుళం వాసుల మృతి

image

నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు చనిపోయారు. టెక్కలికి చెందిన రామయ్య(44), జలుమూరు(M) నగిరికటకానికి తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వెళ్లారు. ముగ్గురూ కలిసి బైకుపై ఆ జిల్లాలోని పొదలకూరుకు పనికి వెళ్లారు. తిరిగొస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. రామయ్య స్పాట్‌లో చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు.

News April 15, 2024

గుంటూరు: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

గుంటూరు నల్లకుంటకు చెందిన తొనుగుంటల సాయి రాజేశ్ (25) చిలకలూరిపేట సమీపంలోని ఓ కళాశాలలో 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో 6 నెలల కిందట ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు లాల్‌పురం పొలాల వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 15, 2024

తూ.గో.: ఫ్రెండ్స్‌తో కలిసి పొలానికి.. తిరిగొస్తుండగా మృతి

image

తూ.గో. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం శివారులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవీంద్ర (24) ఆదివారం స్నేహితులతో కలిసి పొలం వెళ్లగా తల్లి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మంది. ఈ క్రమంలో బైపాస్‌పై బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. అంబులెన్స్‌లో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News April 15, 2024

నెల్లూరు సమీపంలో ముగ్గురు మృతి

image

నెల్లూరుకు సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. శ్రీకాకుళానికి చెందిన రామయ్య(44), తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వచ్చారు. ముగ్గురూ కలిసి ఆదివారం బైకుపై పొదలకూరులో పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను బుల్లెట్ వాహనం ఢీకొట్టింది. రామయ్య స్పాట్‌లోనే చనిపోగా తవిటయ్య, సిమ్మయ్య నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు.

News April 15, 2024

మన అందరి FUTURE CM జూ.ఎన్టీఆర్

image

హిందూపురంలో ‘మన అందరి FUTURE CM జూనియర్ ఎన్టీఆర్’ అంటూ ఫ్లెక్సీ వెలిసింది. దీంతో ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మరోసారి చర్చించుకుంటున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో సోమవారం టీడీపీ, జూ.ఎన్టీఆర్ అభిమానులు ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘యువగళమైనా, జనగళమైనా, నవగళమైనా, ఏ గళమైనా.. ప్రతి తెలుగు నోటా స్మరించే పేరు ఒక్కటే. అది ఎన్టీఆర్’ అంటూ ప్లెక్సీపై రాయడంతో వైరల్‌గా మారింది.

News April 15, 2024

మొదట కర్నూలు ఎమ్మెల్యేగా ప్రకటన.. తరువాత పాణ్యానికి మార్పు

image

ఇండియా కూటమిలో భాగంగా పాణ్యం నుంచి సీపీఎం అభ్యర్థి గౌస్ దేశాయ్‌ని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా మొదట కర్నూలు సీటును సీపీఎంకు కేటాయించారు. దీంతో గౌస్ దేశాయ్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. తరువాత కొన్ని చర్చల అనంతరం కర్నూలు టికెట్ కాంగ్రెస్ తీసుకుని పాణ్యం సీటు సీపీఎంకు కేటాయించింది. దీంతో సీపీఎం నేతలు ప్రచారం ముమ్మరం చేయనున్నారు.

News April 15, 2024

నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి

image

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్‌ను రాష్ట్ర అధిష్ఠానం ఎన్నుకున్నట్లు కొమ్మలపాటి తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, పార్టీ అభివృద్ధి గెలుపుకు కృషి చేస్తానని కొమ్మాలపాటి అన్నారు. అయితే పలువురు పార్టీ పెద్దలు అతనికి అభినందనలు తెలిపారు.

News April 15, 2024

ప.గో.లో 2 రోజులు సీఎం.. పర్యటన ఇలా..

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (నేడు) భీమడోలు మండలం గుండుగొలను వద్ద రాత్రి 7 గంటలకు రోడ్డు షో మొదలు పెడతారని ఎమ్మెల్యే వాసు బాబు తెలిపారు. అనంతరం భీమడోలు, పూళ్ల, కైకరం మీదగా నారాయణపురం చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారన్నారు. అనంతరం మంగళవారం నారాయణపురం, నిడమర్రు, భువనపల్లి, గణపవరం సరిపల్లె మీదుగా భీమవరం చేరుకుంటారన్నారు.

News April 15, 2024

నరసన్నపేట: పెయింటర్ అనుమానాస్పద మృతి

image

నరసన్నపేటలోని ఒక పెయింటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసన్నపేట పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న గండి సోమేశ్వరరావు కుటుంబ కలహాలు కారణంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వెళుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం అతని మృతదేహం కనిపించింది. మండలంలోని సత్యవరం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.