Andhra Pradesh

News March 21, 2024

ఎన్టీఆర్: బీసీ మంత్రం పని చేసేనా.?

image

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.

News March 21, 2024

పాలకొల్లులో ఈసారి గెలుపెవరిదో..!

image

టీడీపీ వచ్చాక పాలకొల్లులో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు ఆ పార్టీ,2 సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. ఈసారి పాలకొల్లులో విజయం ఏ పార్టీది అనే చర్చ సాగుతోంది. 1983,1985,1994,1999, 2004, 2014, 2019లలో టీడీపీ గెలిచింది. 1989, 2009లో కాంగ్రెస్ గెలిచింది. కాగా ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, వైసీపీ నుంచి గుడాల గోపి పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనే దానిపై మీ కామెంట్.

News March 21, 2024

గుంటూరులో వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై గురువారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అన్వర్ భాష తెలిపిన వివరాల మేరకు ఈనెల 19న సుమారు 45సంవత్సరాల వ్యక్తి జిజిహెచ్ ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని చెప్పారు. అతనిని పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారని తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు.

News March 21, 2024

తిరుపతి IITలో ఉద్యోగ అవకాశాలు

image

ఏర్పేడు సమీపంలోని తిరుపతి IITలో సీనియర్ రీసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్టు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యూజీ, పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, గేట్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.

News March 21, 2024

గుంటూరులో దారుణం.. బాలుడిపై లైంగిక దాడి

image

పల్నాడులో బాలుడిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి మిర్చి పనుల నిమిత్తం సంతమాగులూరు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు ఇటీవల వలస వచ్చారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చందు, కోటేశ్వరరావు, కామేశ్వరరావులు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2024

ప .గో జిల్లా వాలంటీర్లకు హెచ్చరిక

image

జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని కలెక్టర్ సుమిత్ రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2024

సూళ్లూరుపేట ఘటనలో ఇద్దరు మృతి

image

సూళ్లూరుపేట మదీనా టపాసుల గోడౌన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చెన్నైకి తరలించారు. ఇందులో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకుమార్, రవి శరీరం 90 శాతం కాలిపోయింది. వీళ్లు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సూళ్లూరుపేట ఎస్ఐ రహీం వెల్లడించారు. మిగిలిన వారికి ఎలాంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు.

News March 21, 2024

ఎన్నికల ప్రధానాధికారి ముందుకు నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) ముఖేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 4గం.లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేదని..? విచారణలో ఏం తేలింది.? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఎస్పీని CEO ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని CEO తెలిపారు.

News March 21, 2024

కొత్తపేటలో జగ్గిరెడ్డి హ్యాట్రిక్ కొడతారా?

image

కొత్తపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలో చిర్ల జగ్గిరెడ్డి ప్రస్తుతం ఐదోసారి పోటీలో ఉన్నారు.2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2009లో ఓటమి చెందారు. 2014, 2019లో వైసీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. పోటీ చేసిన నాలుగు సార్లు, ప్రస్తుతం కూడా ఆయన ప్రత్యర్థి బండారు సత్యానందరావు కావడం విశేషం. మరి జగ్గిరెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా? కామెంట్ చేయండి.

News March 21, 2024

ప్రచారాల్లో పాల్గొనే వాలంటీర్ల తొలగింపుకు చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనే వాలంటీర్లను తొలగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులతో పాటు గౌరవ వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని చెప్పారు.