Andhra Pradesh

News March 21, 2024

ప్రకాశం: వాలంటీర్లకు హెచ్చరిక

image

జిల్లాలో ఇటీవల ఎన్నికల కోడు అమలులోకి వచ్చింది. దీంతో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని కలెక్టర్ దినేశ్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో కొంతమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

News March 21, 2024

తేలినీలాపురంలో చుక్కల దుప్పి మృతి

image

తేలినీలాపురం విదేశీపక్షుల విడిది కేంద్రంలో గురువారం ఒక చుక్కల దుప్పి మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం నందిగం మండలం రాంపురం సమీపంలోని తెట్టంగి పంట పొలాల్లో ఇరుక్కున్న దుప్పిని గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖ అధికారులు తేలినీలాపురం విడిది కేంద్రంలో ఉంచారు. ఈ క్రమంలో గురువారం దుప్పి అస్వస్థతకు గురై మృతి చెందింది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

News March 21, 2024

TPT: ఓటు ఫ్రం హోం.. ఇలా చేయండి

image

తొలిసారిగా 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం ఉన్నవారు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. తాజా వివరాల ప్రకారం తిరుపతి జిల్లాలో 7,940 మంది వృద్ధులు, 24,481 మంది దివ్యాంగులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల లోపు వీరంతా ఫారం12-డీ ద్వారా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. మీ సమీపంలోని బీఎల్వోలను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.

News March 21, 2024

డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

అనంతపురం లోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులు చెల్లింపునకు ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు ఫీజు చెల్లించాలన్నారు.

News March 21, 2024

నరసరావుపేట: ‘ఆ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి’

image

ఎన్నికల కమిషన్ తెచ్చిన యాప్‌లలో ముఖ్యమైన సీ విజిల్ యాప్‌ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. సీ విజిల్ యాప్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. మద్యం, నగదు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు, వీడియోలు ఈ యాప్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. యాప్‌లో పెట్టిన ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కారం చేయడం జరుగుతుందని చెప్పారు.

News March 21, 2024

కూర్మన్నపాలెం: బాలికను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

image

బాలికను ప్రేమ పేరిట వేధిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. దువ్వాడ సెక్టర్-1లో ఉంటున్న డి. మణికంఠ(33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. తొమ్మిదో తరగతి బాలిక పాఠశాలకు రాకపోకలు సాగించే సమయంలో, మణికంఠ ఆమె వెంట పడి, ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. విసిగిపోయిన బాలిక వేధింపుల విషయాన్ని ఇంట్లో చెప్పడంతో, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News March 21, 2024

అనంత: రైలు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

image

రైలు ఢీకొని విధ్యార్థి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాలు.. ఎన్పీకుంట మండలం వంకమద్దికి చెందిన పవన్(17) తిరుపతిలో ఇంటర్ పరీక్షలు రాసి 3రోజుల క్రితం తలుపుల(M) ఎగువపేటలోని మేనమామ ఇంటికి వచ్చాడు. బుధవారం కదిరికి వచ్చిన అతడు హెడ్‌ఫోన్ పెట్టుకుని రైల్వేపట్టాలపై నడుచుకుంటూ మాట్లాడుతుండగా రైలు ఢీకొంది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. 

News March 21, 2024

కొత్తపేట:3 సార్లు గెలుపు 3 సార్లు ఓటమి.. ఈసారి గెలుస్తారా?

image

కొత్తపేట నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు 1994 నుంచి ఇంతవరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా 3 సార్లు గెలిచి, 3 సార్లు ఓటమి చెందారు. టీడీపీ తరఫున (1994,1999), 2009లో ప్రజారాజ్యం తరఫున గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కొన్నాళ్ళు ఆ పార్టీలో కొనసాగి తిరిగి టీడీపీలో చేరారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఈసారి గెలుస్తారా?కామెంట్ చేయండి.

News March 21, 2024

కర్నూలు: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. మైనర్ బాలిక మృతి

image

మంత్రాలయం మండలం చెట్నేహళ్లి చెందిన ఓ మైనర్(17) అదే గ్రామానికి చెందిన టైలర్‌గా పనిచేస్తున్న శివ ప్రేమించుకున్నారు. కులాలు వేరవడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో 18న సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. కోసిగి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశారు.

News March 21, 2024

పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం

image

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బుధవారం లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా నటి అనసూయ సందడి చేసారు. MP డా.సత్యవతి, వ్యవసాయ కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, TDP పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత, TDP నాయకులు యనమల కృష్ణుడు, గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, కాంగ్రెస్ నాయకులు జగతా శ్రీనివాస్ పలు బ్లాకులు ప్రారంభించారు. పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అనసూయ అన్నారు.