Andhra Pradesh

News March 20, 2024

మైదుకూరులో భారీగా గంజాయి స్వాధీనం

image

మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు పట్టణంలోని వీణ విజయ వీధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12.100 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News March 20, 2024

నరసరావుపేట టీడీపీ టికెట్‌పై రగడ

image

నరసరావుపేట TDPలో టికెట్ రగడ కొనసాగుతోంది. నేడు అధిష్ఠానం మూడో జాబితా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో YCP నేత జంగా కృష్ణమూర్తిని TDPలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేటలో ఎప్పటి నుంచో పార్టీని కాపాడుతున్న అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామిరెడ్డి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

News March 20, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు

image

జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలదని మంత్రి, గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక వడ్లపూడిలో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీ సిద్ధపడిందని, అలాంటి పార్టీతో టీడీపీ, జనసేన చేతులు కలిపాయన్నారు. వైసీపీకి ఓటు వేసి కూటమికి బుద్ధి చెప్పాలన్నారు.

News March 20, 2024

ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బయట వ్యక్తులు గుంపుగా ఉండడంపై విద్యాశాఖ, పోలీస్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 20, 2024

విజయవాడ: పవర్ లిఫ్టింగ్‌లో శ్రీదేవికి కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఎన్.శ్రీదేవి కాంస్య పతకం సాధించింది. శ్రీదేవి విజయవాడలోని కేసరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవిని పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సహచర అధ్యాపకులు అభినందించారు.

News March 20, 2024

పిఠాపురంలో లక్ష ఓట్లు కూడా పవన్‌కి రావు: వెల్లంపల్లి

image

గతంలో గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారని అతనికి ఓటమి కొత్త ఏమి కాదని వైసీపీ సెంట్రల్ ఇన్‌ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో లక్ష మెజార్టీ కాదు లక్ష ఓట్లు కూడా పవన్‌కి పడతాయా అని ఎద్దేవా చేశారు. అనంతరం చంద్రబాబు, లోకేశ్ వారి నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తుంటే పవన్‌ని ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.

News March 20, 2024

MP, MLA అభ్యర్థులకు నంద్యాల కలెక్టర్ కీలక ఆదేశాలు

image

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో MP, MLA అభ్యర్థులకు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు MP అభ్యర్థి రూ.95 లక్షలు, MLA అభ్యర్థి రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కొరకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ డా.శ్రీనివాసులు కోరారు.

News March 20, 2024

పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు : వంగా గీత

image

జనసేనలోకి పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీతను, పవన్ కళ్యాణ్ ఆహ్వానించడంపై ఆమె స్పందించారు. పవన్ కళ్యాణ్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు. ‘నేను కూడా పవన్ కళ్యాణ్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. పిఠాపురంలో కేవలం ‘నా మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి’అని ధీమా వ్యక్తం చేశారు.

News March 20, 2024

పెనమలూరు కూటమి అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్?

image

పెనమలూరు TDP-జనసేన-BJP కూటమి MLA అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ నారా లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడు. ఇప్పటికే అధిష్ఠానం IVRS సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. యువగళం సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈయనకే ఈసారి టికెట్ ఇస్తారని విశ్వసనీయ సమాచారం.

News March 20, 2024

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి విమర్శలు

image

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన MLA గా పోటీ చేయాలంటే చంద్రబాబు,MPగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయి ఉండి కూడా ఇటువంటి స్థితిలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. పిఠాపురంలో కాపు సమాజిక వర్గం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌పై ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు.