Andhra Pradesh

News March 20, 2024

చిత్తూరు: గెలిపిస్తారా.. షాక్ ఇస్తారా?

image

ప్రత్యర్థుల బలహీనతల కంటే సొంత పార్టీలోని అసమ్మతి నేతల తీరుపైనే విజయావకాశాలు ఉంటాయి. నగరిలో రోజాను YCP నేతలే వ్యతిరేకించినా ఆమెకే జగన్ టికెట్ ఇచ్చారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు వద్దని జనసేన, టీడీపీ నేతలు బాహటంగా చెబుతున్నారు. సత్యవేడులో ఆదిమూలాన్ని మార్చాలని, తంబళ్లపల్లెలో శంకర్‌కు టికెట్ ఇవ్వాలని నేతలు చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయా చోట్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

గుంటూరుకి చేరిన CRPF బలగాలు

image

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం గుంటూరు రైల్వే స్టేషన్‌కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. గుంటూరు నగరంలో వారు బస చేయడానికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉన్న ఇంటర్ కాలేజీలను కేటాయించారు. 650 మంది సిఆర్పిఎఫ్, 425 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.

News March 20, 2024

యలమంచిలి: ట్రాక్టర్‌ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి

image

యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.

News March 20, 2024

ఎన్నికల కోడ్ అమలు బాధ్యత రిటర్నింగ్ అధికారులదే : కలెక్టర్

image

అనంత :కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు కోడ్ అమలు బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధిత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికలు అధికారి కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా, బస్టాండ్ రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి రాజకీయ పరమైన హోర్డింగ్‌లు పోస్టర్స్ ఉన్న వెంటనే వాటిని తొలగించాలన్నారు.

News March 20, 2024

పొత్తులకు సహకారం లభించేనా?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించారు. తిరుపతిలో అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈక్రమంలో తమకు సీటు రాలేదంటూ కొందరు సహకరించడం లేదని తెలుస్తోంది. సీటు దక్కిన వారు సైతం ఇతర పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి విజయం సాధించాలంటే తప్పకుండా అన్ని పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే విజయావకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

News March 20, 2024

గుడ్లూరు: ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి మృతి

image

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గుడ్లూరు మండలంలోని రాళ్లవాగు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పొట్లూరు గ్రామానికి చెందిన ముసలయ్య, చలంచర్ల రమణయ్యలు బైక్ పై గుడ్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆగిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో ముసలయ్య(29) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 20, 2024

కాంగ్రెస్ MP అభ్యర్థి రేసులో మద్దూరు సుబ్బారెడ్డి మనవడు..?

image

నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి మనవడు మద్దూరు హరి సర్వోత్తమరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల అయన PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, మంత్రిగా,
ఎమ్మెల్సీగా, నంద్యాల కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిన మద్దూరు సుబ్బారెడ్డి సేవలు ఆయన మనవడికి కలిసొస్తుందని భావిస్తున్నారు.

News March 20, 2024

నెల్లూరు: పోలీసులకు ప్రతిభా పురస్కారాలు

image

నెల్లూరు జిల్లా పరిధిలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు ప్రకటించింది. నెల్లూరు సీఐడీ డీఎస్పీ కె.వేణుగోపాల్‌కు ఉత్తమ సేవాపతకం, ఉదయగిరి సీఐ ఎ.గిరిబాబు, దర్గామిట్ట, పొదలకూరు, చిన్నబజారు హెడ్ కానిస్టేబుళ్లు, కావలి అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఫైర్‌మెన్‌కు సేవా పతకాలు ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వీటిని వాళ్లు అందుకోనున్నారు.

News March 20, 2024

పలాస: అసభ్యకరంగా ప్రవర్తించిన డ్రైవర్ పై ఫిర్యాదు

image

జిల్లా కేంద్రం నుంచి పలాసకు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మంగళవారం సాయంత్రం ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా సెల్ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ప్రయాణికులు పలాస డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మేనేజర్ మాట్లాడుతూ.. బస్సు విశాఖపట్నం డిపోకు చెందిందని, ఫిర్యాదును విశాఖపట్నానికి బదిలీ చేస్తానని ఫిర్యాదు దారునికి హామీ ఇచ్చారు.

News March 20, 2024

విశాఖ: ‘అసలు ఎవరి పక్కన ఉన్నారో త్వరలో తెలుస్తుంది’

image

రాష్ట్ర ప్రజలు ఎవరి పక్కన ఉన్నారో త్వరలో తెలుస్తుందని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. అనకాపల్లి ఎంపీ సీటు ప్రకటించేందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఈనెల 27 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్మినవారు తమ పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు.