Andhra Pradesh

News March 20, 2024

ఆంధ్రా – కర్ణాటక సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

జిల్లాలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్బురాజన్  పేర్కొన్నారు. తదనుగుణoగా ఇతర రాష్ట్రాల నుండీ లిక్కర్, డబ్బు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు జిల్లాలోకి రాకుండా కర్నాటక సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్ పోస్టులో నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలియజేశారు.

News March 20, 2024

SKLM: రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు

image

ఆముదాలవలసలో గల శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఓ కార్మికుడు డ్రిల్లింగ్ మిషన్‌ను ఆపకుండా వదిలేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో ఆ డ్రిల్లింగ్ మిషన్ ప్లాట్‌ఫామ్ పై ఓ ప్రయాణికురాలి కాలుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే కాలు విరగడంతో 108లో ఆసుపత్రికి తరలించారు.

News March 20, 2024

నేడు కడప జిల్లాలో పర్యటించనున్న భువనేశ్వరి

image

TDP చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. 20, 21, 22వ తేదీల్లో ఆమె పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు అరెస్టుకు గురై జైలులో ఉండటాన్ని తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ అనే పేరుతో పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి జిల్లాలోని బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేస్తారు.

News March 20, 2024

పెళ్లి పేరుతో మోసం.. కానిస్టేబుల్‌కు జైలు శిక్ష

image

ఓ RPF కానిస్టేబుల్ పెళ్లి పేరుతో మోసం చేశాడు. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడికి చెందిన పరమట వెంకటేశ్వర దొరబాబు పేరూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత ఆమెను పట్టించుకోకపోవడంతో బాధితురాలు 2009 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో అతడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ రాజమండ్రి కోర్టు జడ్జి వై.బెన్నయ్య నాయుడు మంగళవారం తీర్పు చెప్పారు.

News March 20, 2024

చిత్తూరు: CR రాజన్‌‌కు అధ్యక్ష పదవి

image

TDP చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా తిరుచానూరు మాజీ సర్పంచ్‌ CR రాజన్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో వున్న పులివర్తి నాని TDP చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆయన బాధ్యతలను రాజన్‌కు అప్పగిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు విడుదల చేశారు. ఆయన చిత్తూరు సీటు ఆశించగా గురజాల జగన్మోహన్‌కు దక్కింది.

News March 20, 2024

అనుమతి పొందాకే ప్రసారం: జేసీ 

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని కేబుల్‌ ఆపరేటర్లకు జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి సూచించారు. అభ్యర్థులకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) అనుమతి పొందిన రాజకీయ ప్రకటనలను మాత్రమే ప్రసారం చేయాలన్నారు. సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఎంసీఎంసీ సభ్యులు కె.బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

News March 20, 2024

కర్నూలు జిల్లాలో CM జగన్ పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో CM జగన్ పర్యటించనున్నట్లు వైసీపీ నాయకులు వెల్లడించారు. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ఆయన ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రొద్దుటూరులో CM జగన్ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 28న నంద్యాల, 29న కర్నూలు జిల్లాలో నిర్వహించే బస్సు యాత్ర, బహిరంగ సభలో CM జగన్ పాల్గొననున్నారు.

News March 20, 2024

ఆత్మకూరులో ముగ్గురు వాలంటీర్లపై వేటు

image

ఆత్మకూరు నియోజకవర్గంలోని ముగ్గురు వాలంటీర్లపై వేటు వేసినట్లు రిటర్నింగ్ అధికారిని ఆర్డీవో మధులత తెలిపారు. చేజర్ల మండలం పాడేరు గ్రామంలో మేకపాటి విక్రం రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు వాలంటీర్లు పాల్గొన్నారు. సంగం MPDO కార్యాలయంలో రాజకీయ నాయకులతో కలిసి ఓ వాలంటీర్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. దీంతో ముగ్గురిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

News March 20, 2024

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని?

image

నేడో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. విజయవాడ తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో విజయవాడ టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

News March 20, 2024

సముద్ర దొంగల ఆట కట్టించేందుకు వ్యూహాత్మక అడుగులు: యూఎస్ రాయబారి

image

సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని భారత్‌–యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కార్యలయానికి వచ్చిన ఆయన ఐఎన్‌ఎస్‌ జలశ్వ యుద్ధ నౌకలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.