Andhra Pradesh

News March 19, 2024

పవన్‌పై వైసీపీ అభ్యర్థి వంగా గీత సెటైర్స్

image

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కాపు అయితే, నేనూ కాపు ఆడపడుచునే అని అన్నారు. 100 శాతం కాపుల మద్దతు తనకే ఉంటుందని, అన్ని కులాల్లో తనను అభిమానించేవారు ఉన్నారన్నారు. చుట్టం చూపుగా వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోయే వారిని ప్రజలు నమ్మరని సెటైర్స్ వేశారు. పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

News March 19, 2024

కారు-బైక్ ఢీ.. ఓ యువకుడి స్పాట్ డెడ్

image

కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని జల్లిపల్లి గ్రామానికి చెందిన పవన్ (22)గా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

దోర్నాల : ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వ్యక్తి మృతి

image

ప్రకాశం జిల్లా దోర్నాల చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వినుకొండ సమీపంలో స్కూల్‌ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.

News March 19, 2024

విజయనగరం జిల్లాలో హిందీ పరీక్షకు 443 గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. మంగళవారం హిందీ పరీక్షలకు మొత్తం 23890 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. వారిలో 443 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎటువంటి చూసి రాతలు గానీ, మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు అందలేదన్నారు. జిల్లా మొత్తం హిందీ పరీక్ష సజావుగా జరిగిందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News March 19, 2024

19 తులాల బంగారం స్వాధీనం: ఎస్పీ

image

గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. ఏడుగురు ముద్దాయిలను గుర్తించామని తెలిపారు. బొబ్బిలికి చెందిన నారయణరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగతా వారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని వెల్లడించారు.

News March 19, 2024

23న సర్వేపల్లికి నారా భువనేశ్వరి

image

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మార్చి 23న సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలో రెండు కుటుంబాలను పరామర్శిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.

News March 19, 2024

శ్రీకాకుళం: హిందీ పరీక్షకు 458మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పదో తరగతి హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహింగా..458 మంది విద్యార్థులు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటున్నారని తెలిపారు.

News March 19, 2024

కర్నూలు : పరీక్ష రాస్తున్న విద్యార్థినికి అస్వస్థత

image

పెద్దకడబూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైన సింధు అనే విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం జరిగింది. పరీక్ష హాల్లో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలడంతో అధికారులు, ఎస్‌ఐ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News March 19, 2024

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరును ప్రకటించిన నేపథ్యంలో దినేష్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

News March 19, 2024

విశాఖ సాగర జలాల్లో నేవీ విన్యాసాలు

image

విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో సాగర జలాల్లో భారత్ అమెరికా దేశాల మధ్య హెచ్ఎడిఆర్-హ్యుమానిటీరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ పేరుతో నేవీ విన్యాసాలు ప్రారంభమైనట్లు నేవీ అధికారులు తెలిపారు. 18న ప్రారంభమైన విన్యాసాలు సీఫేజ్, హార్బర్ ఫేజ్‌ల్లో కొనసాగుతాయన్నారు. ఇరుదేశాల అధికారులు భారత్ నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, అమెరికాకు చెందిన యుద్ధనౌక టైగర్ ట్రయాంప్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయన్నారు.