Andhra Pradesh

News September 17, 2024

శ్రీకాకుళం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O ప్రారంభం

image

కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O కార్యక్రమాన్ని వర్చ్యువల్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులకు గృహ ప్రవేశాలకు సంబంధించి తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్, నడికుడి ఈశ్వరరావు పాల్గొన్నారు.

News September 17, 2024

20వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ ‌పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 17, 2024

ప.గో.: చీపురు పట్టిన కేంద్ర మంత్రి, కలెక్టర్

image

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భీమవరం అంబేడ్కర్ సర్కిల్‌ వద్ద కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామ కృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఉన్నారు. అంతా కలిసి చెత్త ఊడ్చి డస్ట్‌బిన్‌లో వేశారు.

News September 17, 2024

కడప ఆర్మీ జవాన్ ఆకస్మిక మృతి

image

వేంపల్లి పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చల్లా.సుబ్బారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తు మరణించినట్లు బంధువులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీలో 18 ఏళ్లుగా ఉద్యోగం చేసేవాడు. ఈనెల 15వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతదేహాన్ని మంగళవారం వేంపల్లెకు తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రేణుకా వారికి ఇద్దరు పిల్లలు హేమ,జగదీష్ కలరు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.

News September 17, 2024

పేదింటి రైతు బిడ్డకు ఎంబీబీఎస్ సీటు

image

క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన దూదేకుల రంజిత్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండ్రులు రెహమాన్, మహబూబ్ బీ వ్యవసాయం చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. తన కుమారుడు రంజిత్ నీట్‌లో 582/720 మార్కులు సాధించి మొదట విడత కౌన్సెలింగ్‌లోనే సీటు సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. రంజిత్‌ను పలువురు అభినందించారు.

News September 17, 2024

కావలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

కావలి మండలం తాళ్లపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల శ్రీకాంత్, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు కావలి మండలం జువ్విగుంటపాలెం నుంచి కావలి వస్తుండగా తాళ్లపాలెం వద్ద లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుబ్బారావు నడుముపై లారీ టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాంత్‌ను చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు.

News September 17, 2024

ఎన్ఎంసీకి సీఎం లేఖ రాయడం దుర్మార్గం: తులసి రెడ్డి

image

మౌలిక వసతులు, సిబ్బంది కొరత సాకులు చూపి పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని సీఎం లేఖ రాయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సగం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. ఆ మాత్రాన వీటిని మూసేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ఎంసీకి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి మెడికల్ కళాశాల ప్రారంభించాలని కోరారు.

News September 17, 2024

SKLM: హెల్మెట్ లేకుంటే రూ.1035 ఫైన్

image

బైకు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని.. లేకుంటే ఫైన్ వేస్తామని శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చరించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే రోడ్లపైకి వస్తే రూ.1035 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

News September 17, 2024

పల్నాడు: ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి

image

ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి చెందిన ఘటన నకరికల్లులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అతని భార్య శివ కలిసి ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కెనాల్ కాలువ కట్టపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కాలువలో పడ్డారు. భర్త ఒడ్డు పట్టుకుని బయటకు రాగా, భార్య కాలువలో గల్లంతై మృతి చెందింది.

News September 17, 2024

తిరుపతి: చాట్ బాట్ ద్వారా 310 ఫోన్లు రికవరీ

image

చాట్ బాట్ ద్వారా11వ విడతలో రూ.62 లక్షల విలువ గల 310 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…10 విడతలలో సుమారు రూ.6, 07 కోట్లు విలువచేసే 3,530 సెల్ ఫోన్లు బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వాట్సప్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.