Andhra Pradesh

News September 17, 2024

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం

image

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని FactCheck.AP.Gov.in పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 29వ తేదీన విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది అని తెలిపింది. తిరుమల ప్రతిష్ట మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని ట్విటర్‌లో తెలిపింది.

News September 17, 2024

శ్రీవారి భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఈవో

image

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని ఈవో శ్యామలరావు సూచించారు. మంగళవారం తిరుమలలో దుకాణదారులతో ఆయన సమావేశం అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా వారికి అవగాహన కల్పించారు. నియమ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 17, 2024

బద్రీనాథ్‌లో చిక్కుకున్న 40 మంది తాడిపత్రి వాసులు

image

తాడిపత్రికి చెందిన 40 మంది యాత్రికులు బద్రీనాథ్‌లో చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం గోచార రుద్ర ప్రయాగ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ రహదారిని మూసివేశారు. దీంతో నిన్నటి నుంచి రోడ్డుపైనే ఉంటున్న యాత్రికులు ఆహారం, నీళ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని వారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు.

News September 17, 2024

జగన్‌కు మానసిక స్థితి సరిగా లేదు: వాసంశెట్టి సుభాశ్

image

కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులను సోమవారం మంత్రి వాసంశెట్టి సుభాశ్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌కు అధికారం కోల్పోవడంతో మానసిక స్థితి సరిగా లేదని, దాంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. భారీ వరదలు వచ్చిన సమయంలో కావాలనే బురద రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

News September 17, 2024

ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

image

ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణి పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి)లో చేరారు. డా.హనీషా, డా.యశ్వంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

News September 17, 2024

ఎన్టీఆర్: వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని వేణుగోపాల స్వామి ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును సోమవారం రాత్రి వేలం వేశారు. అయితే వేలంపాటలో గ్రామానికి చెందిన షేక్ మొగలా సాహెబ్, మమ్మద్ దంపతులు వేలంలో పాల్గొని లడ్డూను రూ.27,116లకు దక్కించుకున్నారు. దీంతో విఘ్నేశ్వరుడు మతాలకు అతీతుడైన దేవుడని వీరు నిరూపించగా.. పలువురు వీరిని అభినందించారు.

News September 17, 2024

తెగిపడిన గుంతకల్లు యువకుడి చెయ్యి

image

కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుశ్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. రైలులో పుత్తూరుకు వెళ్తూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

News September 17, 2024

న్యాయం చేయమనాలంటే సిగ్గుగా ఉంది: RRR

image

వైసీపీ హయాంలో తనపై దాడి చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవలే కాదంబరీ జెత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారని, అలానే తనకు కూడా న్యాయం చేయాలని ప్రత్యేకంగా అడుక్కోవాలంటే సిగ్గుగా ఉందన్నారు.

News September 17, 2024

మోదవలసలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

image

డెంకాడ మండలం మోదవలస సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన <<14120812>>విషయం తెలిసిందే<<>>. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలను వెల్లడించారు. విజయనగరం 1-టౌన్‌కు చెందిన నమ్మి మనోజ్ (27), తగరపువలసకు చెందిన అలమండ శ్యాంప్రసాద్ (33) తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

News September 17, 2024

ఎన్టీఆర్: వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని వేణుగోపాల స్వామి ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును సోమవారం రాత్రి వేలం వేశారు. అయితే వేలంపాటలో గ్రామానికి చెందిన షేక్ మొగలా సాహెబ్, మమ్మద్ దంపతులు వేలంలో పాల్గొని లడ్డూను రూ.27,116లకు దక్కించుకున్నారు. దీంతో విఘ్నేశ్వరుడు మతాలకు అతీతుడైన దేవుడని వీరు నిరూపించగా.. పలువురు వీరిని అభినందించారు.