Andhra Pradesh

News April 19, 2024

సీఎం కాన్వాయ్‌లో మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం

image

సీఎం జగన్ బస్సు యాత్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో లేని విధంగా సీఎం కాన్వాయ్ లో డ్రోన్ బేస్డ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటు చేశారు. గురువారం తణుకు నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్రలో ఈ విధానం ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే కాన్వాయ్ కు ముందుగా రెండు కిలోమీటర్ల మేర ఫొటోలు, వీడియోలః ద్వారా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఈ సిస్టం ద్వారా కలుగుతుంది.

News April 19, 2024

విజయవాడ: ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీసు విడుద‌ల‌

image

విజ‌య‌వాడలో సాధార‌ణ ఎన్నిక‌లు 2024లో భాగంగా పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఫారం-1 ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీస్‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్, రిట‌ర్నింగ్ అధికారి ఎస్‌. డిల్లీరావు గురువారం ఉద‌యం విడుద‌ల చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ.. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నామినేష‌న్లు స్వీక‌రిస్తున్నామని తెలిపారు.

News April 19, 2024

2024 ఎలక్షన్.. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం రౌండప్

image

➤నియోజకవర్గం పేరు: కోడుమూరు
➤పోలింగ్ బూత్ల సంఖ్య: 275
➤మొత్తం ఓటర్లు: 219639
➤పురుషులు: 109673
➤మహిళలు : 109943
➤ఇతరులు: 23
➤రిటర్నింగ్ అధికారి :
➤కర్నూలు రెవిన్యూ డివిజనల్ అధికారి శేషి రెడ్డి
➤పోలింగ్ తేదీ: 13-05-2024
➤కౌంటింగ్ తేదీ: 4-06-2024

News April 19, 2024

నర్సీపట్నం: నేడు నామినేషన్ వేయనున్న అయ్యన్నపాత్రుడు

image

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పదో సారి ఎమ్మెల్యే బరిలో ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అయ్యన్న తన ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి ఐదు రోడ్ల జంక్షన్, కృష్ణా బజారు, అబీద్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం చేరుకొని అక్కడ నామినేషన్ వేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయాలని వారు కోరారు.

News April 19, 2024

అనంత: చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు పలికింది. కనిష్ఠ ధర రూ.19 వేలు, సరాసరి ధర రూ.26 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ కు మొత్తం 991 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. .

News April 19, 2024

ఆదోనిలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర

image

పీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రెడ్డి ఈనెల19న చేప‌ట్టే బ‌స్సు యాత్ర‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కాంగ్రెస్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రాంపుల్లయ్య బుధవారం ఆదోనిలో తెలిపారు. ఆలూరు నుంచి ఆదోని మీదుగా ఆలూరు రోడ్డులో కల్లుబావి వ‌ద్ద‌ శ్రీలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో మధ్యాహ్నం బస చేసి సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ రోడ్డు గుండా యాత్ర సాగుతుందన్నారు.

News April 19, 2024

ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కారం

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.

News April 19, 2024

తొలి రోజు ప్రకాశం జిల్లాలో 13 నామినేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి జిల్లాలో నామినేషన్ లు ప్రారంభమయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నలుగురు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దర్శి అసెంబ్లీకి నలుగురు, ONG, కొండపి, గిద్దలూరు, కనిగిరి, SNపాడు నియోజకవర్గాలకు ఒక్కొక్కరు నామినేషన్ వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వైపాలెం, MRKP అసెంబ్లీకి నామినేషన్ దాఖలు కాలేదు.

News April 19, 2024

కడప: సెక్యూరిటీ డిపాజిట్ ఎంతంటే?

image

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. లోక్‌సభకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.

News April 19, 2024

చిత్తూరు: వైసీపీకి సినీ విలన్ మద్దతు

image

చిత్తూరులో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానందరెడ్డి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సినీ విలన్ కబాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.