Andhra Pradesh

News September 17, 2024

మోదవలస వద్ద ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

విశాఖ నుంచి విజయనగరం వెళ్లే రోడ్డు మార్గంలో మోదవలస వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2024

ఒంగోలులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

ఒంగోలు నగర పరిధిలోని హర్షిణి జూనియర్ ఇంటర్ కాలేజీల్లో ఓ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్డిముక్కల భావన మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

పలాస: దుస్తులు చించి ఆశా వర్కర్‌పై దాడి?

image

పలాస(M) లక్ష్మీపురం(P) కిష్టుపురంలో ఆశా వర్కర్‌ బూర్లె కృష్ణవేణిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లలితమ్మ జ్వరానికి, బీపీకి మాత్రలు కావాలని కోరారు. జ్వరానికి మాత్రలు ఇచ్చి.. బీపీకి డాక్టర్లే చెక్ చేసి ఇస్తారన్నారు. దీంతో లలితమ్మ భర్త కృష్ణారావు, ఆమె కుమారుడు మోహన్ కృష్ణవేణిపై దాడి చేశారు. తన నైటీని కూడా చించేశారంటూ సీఐ మోహనరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.

News September 17, 2024

ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్

image

తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దర్శిలో నేడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మకు నోటీసులు అందజేసి గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు సూచించారు. వారితో పాటు, టీడీపీ నాయకులకు సైతం నోటీసులు ఇచ్చారు.

News September 17, 2024

తొండూరు బ్రిడ్జిపై రెండు లారీలు ఢీ

image

తొండూరు బ్రిడ్జిపై అతివేగంగా వస్తున్న రెండు సిమెంట్ లారీలు వెనకనుంచి ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న తొండూరు ఎస్సై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

News September 17, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.35

image

➤ అనంతపురం పాతూరు మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా మేలు రకం రూ.35తో అమ్మకాలు జరిగాయి. కనిష్ఠంగా కిలో రూ.20 పలికాయి.
➤ నగరంలోని మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.18వేల ప్రకారం విక్రయాలు జరిగాయి.

News September 17, 2024

VZM: టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న వివాహిత

image

సహజీవనం చేస్తున్న వ్యక్తి పెడుతున్న టార్చర్ భరించలేక రామనారాయణం వద్ద ఒక అపార్ట్మెంట్‌లో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాలూరులో అగ్రికల్చర్ ఏఈఓగా పనిచేస్తున్న రెడ్డి హైమావతి (34) నల్లగోపి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అనుమానంతో నిత్యం టార్చర్ పెట్టడంతో భరించలేక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు.

News September 17, 2024

నెల్లూరు: రైతులకు GOOD NEWS.. గడువు పెంపు

image

నెల్లూరు జిల్లాలోని పంటల నమోదులో చేయాల్సిన ఈక్రాప్ బుకింగ్ ఈకేవైసీ గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీతో ముగిసిందని జిల్లాలో చాలాచోట్ల నమోదులో కాలేదని దీంతో గడువు పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పంటలు వేసిన రైతులు ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని కోరారు.

News September 17, 2024

చిత్తూరు: సీటుకోసం బ్యాగు వేస్తే బంగారు నెక్లెస్ పాయె..!

image

సీటుకోసం బస్సు కిటికీ లోంచి బ్యాగు వేస్తే రూ.4 లక్షల నెక్లెస్ కొట్టేసిన ఘటన చిత్తూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం.. బెంగళూరుకు చెందిన లక్ష్మి చిత్తూరు బస్టాండ్‌కు వచ్చింది. బెంగళూరు వెళ్లే బస్సు రావడంతో సీటు కోసం కిటికిలో నుంచి ఓ సీటులోకి తన హ్యాండ్ బ్యాగు వేసింది. ఆ సీటులో వేరేవాళ్లు కూర్చొని ఉండడంతో దిగేసింది. కాసేపటికి బ్యాగు తెరచి చూసేసరికి 64 గ్రాముల బంగారం నెక్లెస్ కనిపించలేదు.

News September 17, 2024

బాలినేని దారెటు?

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఎపిసోడ్ పలు మలుపులు తిరుగుతూ సాగుతోంది. ఆయన ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇక ఓటమి తర్వాత ఒంగోలులో రీ వెరిఫికేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇటీవల మళ్లీ ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద చర్చే జరిగింది. దీంతో ఆయన దారెటు అంటూ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.