Andhra Pradesh

News September 17, 2024

కడప: తెగిపడిన యువకుడి చెయ్యి

image

నందలూరు రైల్వే కేంద్రంలో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుష్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రైలులో పుత్తూరుకు వెళుతూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగింది. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

News September 17, 2024

గోనెగండ్ల వద్ద విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కర్నూలు జల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చాకలి తిక్కన్న (35) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తిక్కన్న ఇంటి సమీపంలోని మేకల షెడ్డులో విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు తిక్కన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

ATP: దులీప్ ట్రోపీ మ్యాచ్.. టికెట్లు వీరికి మాత్రమే!

image

అనంతపురం ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో రౌండ్ మ్యాచ్‌లకు త్వరలోనే టికెట్లు పంపిణీ చేస్తామని అనంతపురం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు, కళాశాలలు, ఆర్డీటీ సబ్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులకు మ్యాచ్ పాసులను లెటర్ ప్యాడ్ ఆధారంగా అందజేస్తామని తెలిపారు. 9866157250 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News September 17, 2024

ఈ నెల 19న విశాఖకు గవర్నర్ రాక

image

ఈనెల 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళతారు. సాయంత్రం ఏయూలో నిర్వహించే దివ్య కల మేళాలో ఆయన పాల్గొంటారు. తిరిగి నొవాటెల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 20వ తేదీ సాయంత్రం విమానంలో ఆయన విజయవాడ వెళతారు.

News September 17, 2024

VZM: సిద్ధం కాని వందే భారత్ ట్రైన్ ఛార్జీలు

image

విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు టికెట్ ఛార్జీల చార్ట్ ఇంకా సిద్ధం కాలేదు. అధికారికంగా ఈ రైలు సోమవారం ప్రారంభమైనప్పటికీ, ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌గా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో టికెట్ ఫేర్ చార్ట్‌ను రెండు రోజుల్లోగా రెడీ చేసే అవకాశాలున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయనగరం నుంచి పార్వతీపురం వరకు ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్ అయితే రూ.145 ఉంది.

News September 17, 2024

చిత్తూరు: టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ

image

గంగాధర్ నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ హరీశ్ యాదవ్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సాదరంగా ఆహ్వానించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తానని హరీశ్ యాదవ్ అన్నారు.

News September 17, 2024

పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్లి నెల్లూరు వాసి సూసైడ్

image

అనంతసాగరం(M), కమ్మవారిపల్లికి చెందిన ఆర్ వెంకటేశ్వర్లు(46) కువైట్‌లో సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ సేట్ వద్ద పనిచేస్తున్నాడు. అయతే ఆ సేట్ కొన్నినెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సోమవారం అతని మృతదేహాన్ని కమ్మవారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.

News September 17, 2024

ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు

image

జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివస్‌ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్‌ స్వచ్ఛత – సంస్కార్‌ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.

News September 17, 2024

నెల్లిమర్ల జనసేనలోకి నేడు భారీగా చేరికలు

image

నెల్లిమర్ల లో వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మంగళవారం భారీగా చేరికలు జరగనున్నాయి. వైసీపీ కీలక నేత చనమళ్లు వెంకటరమణ తో సహా ఇద్దరు కౌన్సిలర్లు, పలు గ్రామాలకు చెందిన సర్పంచ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. సుమారు 5 వేల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లోకం మాధవి హాజరుకానున్నారు.

News September 17, 2024

శ్రీకాకుళం: అగ్ని ప్రమాదంపై అనుమానం.. డీసీసీ అధ్యక్షుడు అంబటి

image

పార్టీ ఆస్తులకు ఎవరైనా నష్టం కలిగిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. నగరంలోని ఇందిరా విజ్ఞానభవన్‌లో విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈనెల7 తేదీన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయం ఎవరికీ చెప్పవద్దని పార్టీ నేతలుగా తాము మాట్లాడుకుంటే అదే విషయం పత్రికల్లో కథనాలు రావడాన్ని బట్టి కుట్రకోణం దాగిఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు.