Andhra Pradesh

News September 17, 2024

చిత్తూరు: టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ

image

గంగాధర్ నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ హరీశ్ యాదవ్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సాదరంగా ఆహ్వానించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తానని హరీశ్ యాదవ్ అన్నారు.

News September 17, 2024

పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్లి నెల్లూరు వాసి సూసైడ్

image

అనంతసాగరం(M), కమ్మవారిపల్లికి చెందిన ఆర్ వెంకటేశ్వర్లు(46) కువైట్‌లో సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ సేట్ వద్ద పనిచేస్తున్నాడు. అయతే ఆ సేట్ కొన్నినెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సోమవారం అతని మృతదేహాన్ని కమ్మవారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.

News September 17, 2024

ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు

image

జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివస్‌ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్‌ స్వచ్ఛత – సంస్కార్‌ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.

News September 17, 2024

నెల్లిమర్ల జనసేనలోకి నేడు భారీగా చేరికలు

image

నెల్లిమర్ల లో వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మంగళవారం భారీగా చేరికలు జరగనున్నాయి. వైసీపీ కీలక నేత చనమళ్లు వెంకటరమణ తో సహా ఇద్దరు కౌన్సిలర్లు, పలు గ్రామాలకు చెందిన సర్పంచ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. సుమారు 5 వేల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లోకం మాధవి హాజరుకానున్నారు.

News September 17, 2024

శ్రీకాకుళం: అగ్ని ప్రమాదంపై అనుమానం.. డీసీసీ అధ్యక్షుడు అంబటి

image

పార్టీ ఆస్తులకు ఎవరైనా నష్టం కలిగిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. నగరంలోని ఇందిరా విజ్ఞానభవన్‌లో విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈనెల7 తేదీన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయం ఎవరికీ చెప్పవద్దని పార్టీ నేతలుగా తాము మాట్లాడుకుంటే అదే విషయం పత్రికల్లో కథనాలు రావడాన్ని బట్టి కుట్రకోణం దాగిఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు.

News September 17, 2024

తాడిపత్రిలో 10 తులాల బంగారం చోరీ

image

తాడిపత్రిలోని గాంధీనగర్‌లో సోమవారం చోరీ జరిగింది. నాగరాజు ఇంట్లో లేని సమయంలో దాదాపు 10 తులాల బంగారాన్ని దూసుకెళ్లినట్లు పట్టణ పోలీసులకు భాదితులు నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు మూడో స్థానం

image

ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.

News September 17, 2024

తాడేపల్లి: ‘రైతులు కోరుకున్న చోటే ప్లాట్లు’

image

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని రైతులు స్వచ్చందగా తమ భూమిని పూలింగ్‌కి అందజేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి నారాయణకు ఏడు ఎకరాలు భూమికి సంబందించిన నలుగురు రైతులకు అంగీకారపత్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులు కోరుకున్న చోటే ప్లాట్స్ కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అలానే కౌలు ఒక ఇన్స్టాల్మెంట్ రైతులు ఖాతాలో వేయటం జరిగిందని త్వరలోనే 2వ ఇన్స్టల్మెంట్ వేస్తామన్నారు.

News September 17, 2024

నేడు రాజమహేంద్రవరంలో స్వచ్ఛతా హీ సేవ, విశ్వకర్మ జయంతి వేడుకలు

image

రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని, విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9:30 నుంచి రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుతామన్నారు.

News September 17, 2024

విజయవాడలో దసరా ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు: సీపీ

image

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు తెలిపారు. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. క్యూ లైన్లు, స్నానపు ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రాంతాలను పరిశీలించారు.