India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో మంగళవారం రాత్రి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కొద్దిసేపు యువకులంతా కొట్టుకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ నరసింహులు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. పట్టణంలో యువకులు మత్తు పానీయాలకు అలవాటు పడి రాత్రి సమయాల్లో గొడవకు పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
ఓ ఫోన్ నంబర్ వివాదం ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. ఏనుగుంట్లపల్లి హరిజనవాడకు చెందిన ఉమకు 14 ఏళ్ల కిందట వివాహం జరగ్గా.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె ఫోన్ నంబర్ పక్కింట్లో ఉండే శివశంకర్ ఫోన్‌లో ఉంది. దీనిని గమనించిన అతని భార్య సుజాత.. ఉమతో పాటు భర్తను నిలదీసింది. దీంతో మనస్థాపం చెంది ఉమ ఇంట్లోనే ఉరేసుకుంది.
ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు తాలుకా PS పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేయగా.. బహిరంగంగా మద్యం తాగుతూ ముగ్గురు పట్టుబడ్డారు. ఇలాగే బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
పెదచెర్లపల్లి మండలం దివాకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 7:15 నిమిషాలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. 9:15కు దివాకరపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9: 25 నిమిషాలకు బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45 వరకు సభలో పాల్గొంటారు. 11:55 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావుని మంగళవారం ఏపీటీఎఫ్ యూనియన్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యాలయంలో సమావేశమైన యూనియన్ నాయకులు, ఉపాధ్యాయుల జీత భత్యాలు, పదోన్నతులు, బదిలీలతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
స్థానిక లాలా చెరువు రహదారి ప్రధాన మార్గంలో ఏప్రిల్ 4న జరిగే ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన’కు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎమ్.మల్లిఖార్జున రావులతో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన గోడ ప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు.
శ్రీకాకుళం జిల్లాలో టెన్త్ క్లాస్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. 151 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 129 మంది, 22 మంది ప్రైవేట్ విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8 తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్‌లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
అనంతపురం జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చేతి పంపులు, పవర్ బోర్లు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి అన్ని విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025-26 కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు.
Sorry, no posts matched your criteria.