Andhra Pradesh

News April 2, 2025

కడప జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 16 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా 12 మంది సీఐలను బదిలీ చేయగా తాజాగా 16 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని  ఆదేశించారు.

News April 2, 2025

కర్నూలు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా.. మంగళవారం కర్నూలులోని సాయిబాబా సంజీవ నగర్‌లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వితంతు, వృద్ధాప్య పెన్షన్‌లను వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పంపిణీ చేశామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు హాజరయ్యారు.

News April 2, 2025

VZM: ‘మహిళల జీవనోపాధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి’

image

మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష జరిపారు. మహిళలతో రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, లాభదాయక పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదాయం పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.

News April 2, 2025

GNT: కారు ప్రమాద ఘటనపై పెమ్మసాని స్పందన

image

తెనాలికి చెందిన గిడుగు రవీంద్ర మోహన్ బాబు కుటుంబానికి జరిగిన కారు ప్రమాద ఘటనపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. మృతుల బంధువులను, ఆసుపత్రి వర్గాలను డిల్లీ నుంచి ఫోన్ ద్వారా సంప్రదించారు. గుండె నిబ్బరం చేసుకుని సందీప్ దంపతులకు అందంగా అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూసే ప్రయత్నం చేస్తానని, ఈ సందర్భంగా సందీప్ బంధువులకు పెమ్మసాని వివరించారు.

News April 2, 2025

కడపలో హిజ్రాల ఆందోళన

image

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.

News April 2, 2025

ప.గో: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించాలి..జేసీ

image

రబీ ధాన్యం కొనుగోళ్లకు వేగవంతమైన చర్యలు ప్రారంభించాలని, కొనుగోళ్లలో రైతుకు లాభం చేకూర్చేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ధాన్యం సేకరణ కమిటీ అధికారులతో సమీక్షించారు. ఈ రబీ సీజనులో కనీస మద్దతు ధర ప్రతి క్వింటా ధాన్యంకు సాధారణ రకం రూ.2,300 చొప్పున, గ్రేడ్-ఏ రకానికి రూ.2,320 గా నిర్ణయించడం జరిగిందన్నారు.

News April 2, 2025

మచిలీపట్నం: పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి – కలెక్టర్

image

మచిలీపట్నం నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో మున్సిపల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ పారిశుద్ధ్య చర్యలపై చర్చించారు. నగరంలో మార్కెట్ యార్డు, లేడీయాంప్తిల్ కళాశాల, పద్మావతి మహిళా కళాశాల తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలు ఎలా పని చేస్తున్నాయో మొబైల్ ద్వారా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

News April 1, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ
➤ కర్నూలు: టెన్త్ పరీక్షలకు 430 మంది గైర్హాజరు-డీఈఓ
➤ కర్నూలు: సెక్షన్ 11 నోటీస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు- సబ్ కలెక్టర్
➤ కర్నూలు జిల్లాలో 9 కరవు మండలాలు
➤ కర్నూలు జిల్లాలో వింత ఆచారం
➤ పెద్దకడబూరు: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

News April 1, 2025

విశాఖలో ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

image

ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు విశాఖలోని ఆలిండియా రేడియో సమీపంలోని ఉత్కల్ సాంస్కృతిక సమాజ్ ప్రాంగణంలో మంగళవారం జరిగాయి. ఒడిశా ఫుడ్ ఫెస్టివల్ లో కాకారా చెనాపోడా, దహి బారా, గుగుని, మాల్పువా ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఉత్కల్ గౌరబ్ మధు సుదాన్ దాస్, ఉత్కలనీ గోపాబాధి వంటి గొప్ప వ్యక్తులకు నివాళులర్పించారు. ఐఆర్ఎస్ అధికారి రాజేంద్ర కుమార్, రైల్వే ఏడిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.

News April 1, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
☞జూన్‌లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్
☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం
☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు
☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు
☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు