Andhra Pradesh

News September 16, 2024

కోసిగిలో రైలు కింద పడి వ్యక్తి మృతి

image

కోసిగిలోని రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రైల్వే గేట్ సమీపంలో బాలప్ప తోట వద్ద పట్టాలపై తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. మృతుడు పట్టణంలోని బులొల్లి గేరికి చెందిన బంగారి కోసిగయ్యగా స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2024

సీఎం సహాయ నిధికి మాజీ సైనికులు రూ.5 లక్షల సాయం

image

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడలో వరద బాధితులు సహాయర్థం సీఎం సహాయ నిధికి శ్రీకాకుళం మాజీ జిల్లా సైనికులు కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి సోమవారం ఐదు లక్షల రూపాయలు చెక్కు రూపంలో జిల్లాలో 16 యూనియన్లు కలిసి విరాళం అందించారు. ఈవిషయాన్ని జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మాజీ సైనికులు పాల్గొన్నారు.

News September 16, 2024

ప్లేయర్లకు శుభవార్త.. అనంతపురంలో క్రికెట్ అకాడమీ!

image

ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీకి వేదికైన అనంతపురంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ (ACA) ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీఏ కార్యకర్గ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కడపలోని అకాడమీని అనంతపురానికి తరలిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సభ్యులు చర్చించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటైతే ప్రతిభ ఉన్న క్రికెటర్లకు నాణ్యమైన ట్రైనింగ్ ఫ్రీగా లభిస్తుంది.

News September 16, 2024

మాజీ ఎంపీ మేకపాటి రూ.25 లక్షల సాయం

image

తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.25 లక్షల చెక్కును అందించారు. ఇటీవల వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో వారి సహాయార్థం సాయం అందించానన్నారు.

News September 16, 2024

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

image

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని ఎస్పీ దామోదర్ చెప్పారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న కొందరికి వివిధ మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వగా, మరికొందరిని వీఆర్‌‌కు బదిలీ చేశారు.

News September 16, 2024

నెల్లూరు: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

image

నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ గౌడ్, రెండో డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు, వారందరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు

News September 16, 2024

నంద్యాల: ఫిరోజ్‌పై దాడి.. TDP అధిష్ఠానం సీరియస్..!

image

పక్కా వ్యూహంతోనే ఓ క్రియాశీలక టీడీపీ నాయకుడి అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై టీడీపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఫిరోజ్ పేర్కొన్నారు.

News September 16, 2024

శ్రీకాకుళం: చనిపోయినా కష్టాలే..!

image

శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల చనిపోయిన తర్వాత కూడా కొందరికీ కష్టాలు తప్పడం లేదు. జలుమూరు మండలం తలతరియా పంచాయతీ లింగాలపాడులో సోమవారం వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. స్థానిక గ్రామంలోని దళితుల శ్మశానానికి సరైన దారి లేదు. ఈక్రమంలో నడుము లోతు నీటిలో చిన్న గట్టు వెంబడి మృతదేహాన్ని ఇలా తరలించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ రహదారి సౌకర్యం కల్పించలేదని గ్రామస్థులు వాపోతున్నారు.

News September 16, 2024

జీకే.వీధి: పచ్చకామెర్లతో విద్యార్థిని మృతి.?

image

గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News September 16, 2024

చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.