Andhra Pradesh

News September 16, 2024

గుంటూరు: నారాకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం

image

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2024

చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News September 16, 2024

ప్రేమ, దయ భావనలతో ఉండాలి: చంద్రబాబు

image

ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు చంద్రబాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందని అన్నారు.

News September 16, 2024

పోలవరం: 8.14 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

image

గోదావరికి వరద ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఆదివారం సాయంత్రానికి 31.57 మీటర్లకు నీటి మట్టం చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్ల ద్వారా 8.14 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. అదేవిధంగా గోదావరికి వరద తగ్గడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News September 16, 2024

కర్నూలు క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

image

☛ ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవలందించింది?
☛ కొండారెడ్డి బురుజును ఎవరు నిర్మించారు?
☛ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మించిన గ్రామం పేరేంటి?
☛ పూర్వం నంద్యాలను ఏ పేరుతో పిలిచేవారు?
☛ వరల్డ్​బుక్​ ఆఫ్​రికార్డ్స్‌లో శ్రీశైలం ఆలయానికి చోటు దక్కడానికి కారణమేంటి?
★ పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.

News September 16, 2024

పోరుమామిళ్ల మండలంలో వ్యక్తి సూసైడ్

image

పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈదుళ్ళపళ్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి, ఇది హత్యా ఆత్మహత్యా అన్న కోనంలో దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2024

చిత్తూరు జిల్లాకు రాష్ట్రంలో 8వ స్థానం

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ కేవైసీ నమోదు ఆదివారంతో ముగిసిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటి వరకు 2,38,611 ఎకరాల్లో ఈ-పంట నమోదు చేసి 98.53 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఇంకా 3,563 ఎకరాల్లో ఈకేవైసీ పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈకేవైసీలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు.

News September 16, 2024

తిరుపతి: I7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

image

తిరుపతి పట్టణంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈనెల 17వ తేదీ నుంచి రెండో విడత పీజీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మొదటి విడత పీజీ కౌన్సిలింగ్ లో హాజరుకాని విద్యార్థినులు రెండో విడత కౌన్సిలింగ్ కి హాజరుకావాలని కోరారు. పీజీసెట్ లో అర్హత సాధించిన విద్యార్థినులు తమకు కావాల్సిన కోర్సును వెబ్ ఆప్షన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News September 16, 2024

రాష్ట్రస్థాయి పోటీల్లో సిక్కోలు క్రీడాకారుల ప్రతిభ

image

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సిక్కోలు జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వేదికగా ఈనెల 13, 14, 15వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా బాలుర జట్టు ద్వితీయస్థానం, బాలికల జట్టు తృతీయ స్థానాలను సొంతం చేసుకుంది. విజేతలకు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోత పూర్ణచంద్రరావు, పీవీజీ కృష్ణంరాజు అభినందనలు తెలిపారు.

News September 16, 2024

అరకులోయ: మళ్లీ పెరిగిన అల్లం ధరలు

image

అల్లం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల మన్యంలో వర్షాలు అధికంగా పడటంతో అల్లం పంట దెబ్బతింది. దీంతో దిగుడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. జూన్, జులై నెలల్లో అల్లం ధర కేజీ రూ.150 ఉండగా ఆ తరువాత కేజీ రూ.120 నుంచి రూ.130కి తగ్గింది. ప్రస్తుతం చింతపల్లిలో కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. త్వరలో కొత్త అల్లం మార్కెట్లోకి వస్తుంది. ఇది వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.