Andhra Pradesh

News September 16, 2024

విశాఖ: జిల్లాకు అదనంగా 150 నుంచి 200 రేషన్ డిపోలు

image

విశాఖ జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య 150 నుంచి 200 వరకు పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రాష్ట్రం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.29 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతూ వస్తున్నా డిపోలు మాత్రం పెరగలేదు. ఈనెల 30 నుంచి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

News September 16, 2024

గుంటూరు జిల్లాలో పలువురు డీఎస్పీల బదిలీ

image

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకాతిరుమల రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విఆర్ లో ఉన్న ఎం.రమేశ్‌ను గుంటూరు ట్రాఫిక్‌కు, గుంతకల్‌లో ఉన్న షేక్ అబ్దుల్ అజీజ్‌ను గుంటూరు తూర్పునకు, పీసీఎస్‌లో ఉన్న ఎం. హనుమంతరావును సత్తెనపల్లికి, ఎమ్మిగనూర్‌లో ఉన్న బి.సీతారామయ్యను గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

News September 16, 2024

పెద్దారవీడు: కొట్లాట ఘటనపై ముమ్మర దర్యాప్తు

image

పెద్దారవీడు మండలం రాజంపల్లి పొలాల్లో <<14111250>>ఆదివారం కర్రల దాడి<<>>లో గాయపడిన బాధితులు మార్కాపురం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, అల్లూరెడ్డిలు కర్రలతో దాడికి దిగగా.. ఈ దాడిలో కంచర్ల చెన్నకేశవులు, కంచర్ల అంజమ్మ, చరణ్, రామాంజనేయులు, రాములమ్మతోపాటు మరొకరికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన జిల్లా వ్యప్తంగా సంచలనం రేపగా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

News September 16, 2024

చిన్నారిపై లైంగిక దాడికి యత్నం.. కేసు నమోదు

image

ఉమ్మడి ప.గో.జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై శనివారం రాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాల ప్రకారం.. నల్లజర్ల మండలానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి మద్యం తాగి బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న తమ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు DSP దేవకుమార్ పేర్కొన్నారు.

News September 16, 2024

కొత్తవలస: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే

image

కొత్తవలస టౌన్ వెంకట శివానగర్‌లో ఆదివారం గొలగాని పావని<<14110348>> ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను నిర్లక్ష్యం చేయడంతో బాధితురాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న భర్త ఆమెను ఈ మధ్య తరచూ వేధించేవాడు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నిర్లక్ష్యంతో ముగ్గురి జీవితాల్లో విషాదం నెలకొంది.

News September 16, 2024

ఇబ్రహీంపట్నం SIపై ముంబై నటి జెత్వానీ ఫైర్

image

ముంబైకు చెందిన సినీ నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం PSలో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆమె స్టేషన్‌లో ఉన్న ఓ SIపై ఆగ్రహం వ్యక్తం చేయటం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి తనను బంధువుల వద్ద నుంచి అప్పట్లో ఇబ్రహీంపట్నానికి తీసుకువచ్చింది ఈయనే అంటూ ఆమె SIపై గట్టిగా అరిచింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె వైపు చూస్తూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘాపెట్టారు.

News September 16, 2024

ఓడినా అప్పలరాజుకు బుద్ధి రాలేదు: మంతెన

image

రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్యనే తెలియని మాజీ మంత్రి అప్పలరాజు ఎంబీబీఎస్ సీట్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండడిపడ్డారు. ‘అప్పలరాజు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. అందుకే చంద్రబాబు మెడికల్ సీట్లు తగ్గించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పలాస ప్రజలు ఆయనను ఓడించినా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా అప్పలరాజు నోరు తగ్గించుకోవాలి’ అని మంతెన సూచించారు.

News September 16, 2024

వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా

image

NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News September 16, 2024

విచారణకు సహకరించని నందిగం సురేశ్.?

image

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన విచారణకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా తనకేమీ తెలియదు అన్నట్లు సురేశ్ వ్యవహరించారని విశ్వసనీయ సమాచారం. కాగా సురేశ్‌ను పోలీసులు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించనున్నారు.

News September 16, 2024

మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

image

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(M) మొగిలి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. తిరుమల నుంచి పలమనేరు వైపుగా వస్తున్న RTC బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనగా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన పద్మావతి చికిత్స పొందుతూ అదివారం మృతి చెందింది.