India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివ శంకర్ సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియలో భాగంగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలను పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. భద్రత పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు.
సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని టీడీపీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. వంగర మండలం అరసాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీల కోసం రూ.36వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీలకు వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు.
ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు ఎస్పీ జాషువా కోరారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
పెరవలి మండలం నడుపల్లి గ్రామానికి చెందిన చిర్రా గోపాల్ వందోసారి రక్తదానం చేశారు. తణుకులోని బ్లడ్ బ్యాంకులో శుక్రవారం ఆయన ఈమేరకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. 18 ఏళ్ల వయసులో ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో రక్తదానం చేసిన గోపాల్ అదే స్ఫూర్తితో 3 నెలలకోసారి రక్తదానం చేస్తూ ఇప్పటి వరకు వందమందికి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.
గుంటూరు క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతురాజు, సౌత్ డీఎస్పీ మహబూబ్ బాషాలకు ఉగాది పురస్కారాలు డీజీపీ డిస్క్ అవార్డులకు ఎంపికయ్యారు. వారిని శుక్రవారం పోలీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలు అందుకున్న అధికారులు మాట్లాడుతూ.. తాము చేసిన సేవలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయటం సంతోషంగా ఉందని చెప్పారు.
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావలసిన అవసరముందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నట్లు బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు. ధర్మవరం కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. తన నివాసానికి వచ్చిన మందకృష్ణతో సత్య తాజా రాజకీయాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ ఆశయం త్వరలో నెరవేరుతుందన్నారు.
విశాఖలో తొలిసారిగా ఒక దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశా దివ్యాంగ్ సురక్ష ద్వారా ఈ నెల 15న డయల్ యువర్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కోటవురట్లకు చెందిన ఒక దివ్యాంగుడు ఫోన్ చేసి.. అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఒక సంస్థ తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిందని బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజంపేట MP అభ్యర్థిగా మరోసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2014, 19లో గెలిచిన ఆయన హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో ఆయన ప్రత్యర్థిగా మాజీ CM ఎన్టీఆర్ కుమార్తె పురందీశ్వరి పోటీ చేశారు. 2019లో TTD మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ TDP తరఫున బరిలో నిలిచారు. తాజా ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా గెలుపు ఎవరిదో చూడాలి.
#Elections2024
సింగరాయకొండ పట్టణంలోని రాయల్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40సం.రాలు ఉంటుందని, మృతుడి చేతి మీద కేశవ పద్మావతి అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.
రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుకు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రాజంపేటలో భవనంపై నుంచి దూకుతానని కొద్దిసేపు హల్చల్ చేశారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. టీడీపీ నేతలు కొందరు హుటాహుటిన భవనం పైకెక్కి మందా శీనును సముదాయించి కిందికి దించారు.
Sorry, no posts matched your criteria.