Andhra Pradesh

News September 16, 2024

విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీకి నేడు సెలవు

image

మిలాద్ ఉన్ నబీ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సోమవారం సెలవు ప్రకటించినట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనంజయరావు తెలిపారు. సోమవారం ఏయూకు సెలవు లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

News September 16, 2024

VZM: జాతీయస్థాయిలో జిల్లాకు టైక్వాండో పతకాలు

image

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు జాతీయ సబ్ జూనియర్ టైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజయనగరానికి చెందిన క్రీడాకారులు 8 మెడల్స్ సాధించారు. కే.సాహిత్య – 1 గోల్డ్ 1 బ్రాంజ్, పీ.పునీత్ – 1 సిల్వర్ 2 బ్రాంజ్, వి. కుషాల్ – 1 సిల్వర్ 1బ్రాంజ్, ఎస్.సాత్విక్ – 1 సిల్వర్ గెలుపొందారు. క్రీడాకారులను రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు.

News September 16, 2024

నంద్యాలలో మంత్రి కుమారుడిపై దాడి

image

నంద్యాలలో ఆదివారం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌పై నలుగురు దుండగులు దాడి చేశారు. రాజ్ థియేటర్ నుంచి వాహనంలో వెళ్తుండగా మోటార్ బైక్‌పై వెంబడించిన నలుగురు ఫిరోజ్ వెహికల్‌పై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్.. వాహనం దిగి దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News September 16, 2024

ప.గో: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

ఇవాళ ఈద్ – ఎ – మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో జరగాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి భీమవరంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎవరూ రావద్దని సూచించారు.

News September 16, 2024

ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ రద్దు

image

ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్, డివిజనల్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కావున ప్రజల ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 16, 2024

VZM: జాతీయస్థాయిలో జిల్లాకు టైక్వాండో పతకాలు

image

ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిన జాతీయ సబ్ జూనియర్ టైక్వాండో పోటీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరింది. ఈ పోటీలలో విజయనగరానికి చెందిన క్రీడాకారులు 8 మెడల్స్ సాధించినారు. కే.సాహిత్య – 1 గోల్డ్ 1 బ్రాంజ్, పీ.పునీత్ – 1 సిల్వర్ 2 బ్రాంజ్, వి. కుషాల్ – 1 సిల్వర్ 1బ్రాంజ్, ఎస్.సాత్విక్ – 1 సిల్వర్ గెలుపొందారు. క్రీడాకారులకు రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు.

News September 16, 2024

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

image

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.

News September 16, 2024

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ ఆదివారం తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబర్ 23న తిరిగి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తామన్నారు.

News September 16, 2024

ప్రకాశం: ‘మీకోసం’ తాత్కాలికంగా రద్దు

image

సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా (పబ్లిక్ హాలిడే) జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించి దూర ప్రాంతాల నుంచి ఎవరు రావద్దని సూచించారు.

News September 16, 2024

తూ.గో: పెద్దాపురంలో వికసించిన బ్రహ్మ కమలం

image

హిమాలయ పర్వత శ్రేణుల్లో పెరిగే బ్రహ్మ కమలం పెద్దాపురంలో కొత్తపేట రామాలయం వీధికి చెందిన ఆదిరెడ్డి విజయలక్ష్మి ఇంటి పెరటిలో ఆదివారం వికసించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే బ్రహ్మ కమలం మొక్కను ఆమె తులసి కోటలో నాటగా బ్రహ్మ కమలం వికసించటంతో ఆదివారం ఈ కమలాన్ని చూడడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు.