India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరం సంతపేటలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఎడ్ సెట్ అర్హత సాధించి ఎక్కడా అడ్మిషన్ పొందని విద్యార్థులు ఏప్రిల్ 2వ తేదీ వరకు కళాశాలలో జరిగే స్పాట్ కౌన్సిలింగ్ లో పాల్గొనాలని సూచించారు. రిజిస్ట్రేషన్, కాలేజీ ఫీజుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని కోరారు.
దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం మద్దిశెట్టి వేణుగోపాల్ అయితే పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు నియోజకవర్గ ప్రజలకు ఐవిఆర్ఎస్ కాల్స్ చేయించి సర్వే చేయిస్తోంది. దీంతో ఆయన పార్టీ మారనున్నారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అయితే దర్శిలో ఇప్పటికే పలువురి పేర్లతో ఈ సర్వే కొనసాగుతోంది.
అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హసన్‌బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్య ఎక్కడ తలెత్తిన 08554-275892, 9390098329 నంబర్లకు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని కోరారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు.
2019 బాపట్ల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ గెలుపుపై మళ్లీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్‌పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సీటును కైవసం చేసుకొనేందుకు రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దింపింది. వైసీపీ తరఫున మళ్ళీ ఎంపీ నందిగం సురేశ్‌కే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కోటియా గ్రూపు గ్రామమైన దిగువ గంజాయబద్రలో కొత్త విద్యుత్ మీటర్లు వెయ్యడానికి వెళ్లిన ఏపీ విద్యుత్ అధికారులను ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. ఆయా గ్రామాలు ప్రజలు విద్యుత్ మీటర్లు కోసం దరఖాస్తులు చెయ్యగా.. గత కొన్ని రోజులుగా విద్యుత్ మీటర్లు సిబ్బంది బిగిస్తున్నారు. గురువారం వెళ్లిన అధికారులను కోటియా పోలీసులు బంధించగా, ఉన్నత అధికారులు ఒడిశా అధికారులతో మాట్లాడి విడిపించారు.
తిరువూరు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ గన్‌మెన్ మారిపోగు మోహన్ రోడ్డు ప్రమాదంలో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. విజయవాడ లాండ్ ఆర్డర్ డీసీపీ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ బైకు మీద తిరువూరు వైపు వస్తుండగా మంగళగిరి వడ్డేశ్వరం వద్ద వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో మోహన్ మృతిచెందాడు. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన చినవెంకట సాంబమూర్తి RDO ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్. ఆయనకు ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంకు చెందిన రాధిక(31)తో 2010లో పెళ్లైంది. రెండ్రోజుల కింద రాధిక ఊరివేసుకొని మృతి చెందింది. అదనపుకట్నం తీసుకురావాలని తరచూ భర్త వేధించడం వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో రేపు ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ఈ సభతోనే జనసేన అధినేత పవన్ ప్రచారం షురూ కానుంది. SAT 12.30 PMకు పవన్ గొల్లప్రోలు హెలిప్యాడ్‌లో దిగుతారు. పాదగయలో పూజలు.. పొన్నాడలోని బషీర్ బీబీ దర్గా దర్శనం.. పిఠాపురంలోని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం 4.30 PMకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం నుంచి ప్రచారాన్ని ఎన్నికల మొదలు పెట్టనున్నారు.
మాకవరపాలెం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని వెంటపడి వేధిస్తున్నాడన్న ఆరోపణపై నర్సీపట్నం కొత్తవీధికి చెందిన యువకుడు వి.అయ్యప్పపై కేసు నమోద అయ్యింది. గురువారం కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ కాంతికుమార్ తెలిపారు. ఈ యువకుడు కొద్దిరోజులుగా కళాశాల వరకు ఆమె వెంట పడటమే కాకుండా అటకాయించి కొట్టేందుకు ప్రయత్నించాడని వివరించారు.
కుప్పం పట్టణంలోని డాక్టర్ వైసీ జేమ్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ( PolyCET) – 2024 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథం పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హులన్నారు.
Sorry, no posts matched your criteria.