India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడలోని ఉప్పలంక వద్ద వాహన తనిఖీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్‌పై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకొని కరప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ బోధిస్తున్న జూనియర్ కళాశాలలకు శుక్రవారం నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి 28వ తేదీ వరకు పని దినాలుగా నిర్ణయించడంతో నేటి నుంచి జూనియర్ కళాశాలలు మూతపడనున్నాయి.
ఎచ్చర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో లా కోర్సు కు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. మూడేళ్ల ఎల్.ఎల్.బి,లో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, ఐదేళ్ల కోర్సులో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, తొమ్మిదో సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలలో జ్ఞానభూమి పోర్టల్ లో అందుబాటులో ఉంచామన్నారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి వేసవి నెలవులు ప్రకటిస్తున్నట్లు ఆర్ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. జూన్ 1న కళాశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలన్నింటికి ఈ ప్రకటన వర్తిస్తుందన్నారు. వేసవి సెలవుల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంటూరు మిర్చియార్డుకు మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. మూడు రోజులు పాటు మిర్చి క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో సాధారణంగా లావాదేవీలు జరగవు. ఈ వారంలో మూడు రోజులు మాత్రమే క్రయవిక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలని యార్డు నిర్వాహకులు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో CM, మాజీ CM ఇవాళ పర్యటించనున్నారు. బనగానపల్లెలో TDP అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ కార్యక్రమంలో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో CBN ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే మరో వైపు సీఎం జగన్ ఎమ్మిగనూరు వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సాయంత్రం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో పాల్గొంటున్నారు.
విశాఖ నగరంలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావు బెయిల్ మంజూరు కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తిరస్కరించారు. గంగారావు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు దాఖలు చేసుకున్న పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. వాదనల అనంతరం నిందితుడికి బెయిల్ మంజూరు తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 55,562 మంది రైతుల నుంచి రు.1070.07 కోట్ల విలువైన 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ నెల 31 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఆ తర్వాత కేంద్రాలను మూసివేస్తామని ఆమె చెప్పారు. ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తిరుపతి నగరం జీవకోనలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం ఎన్నికల నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ దుకాణంలో ఆయన స్వయంగా దోశలు వేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రచారం, ప్రకటన ప్రదర్శన నిర్వహించడంలో స్థానిక సంస్థల పరిధికి లోబడి, భద్రతాపరమైన అంశాల నేపథ్యాన్ని అనుసరించి మాత్రమే అనుమతులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్థానికంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శించే హోర్డింగుల విషయంలో స్థానిక సంస్థలకు చెందిన చట్టాలను అనుసరించే అనుమతుల మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.