Andhra Pradesh

News March 29, 2024

దోశలు వేసిన తిరుపతి MLA అభ్యర్థి

image

తిరుపతి నగరం జీవకోనలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం ఎన్నికల నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ దుకాణంలో ఆయన స్వయంగా దోశలు వేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News March 29, 2024

ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి: కలెక్టర్

image

ప్రచారం, ప్రకటన ప్రదర్శన నిర్వహించడంలో స్థానిక సంస్థల పరిధికి లోబడి, భద్రతాపరమైన అంశాల నేపథ్యాన్ని అనుసరించి మాత్రమే అనుమతులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్థానికంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శించే హోర్డింగుల విషయంలో స్థానిక సంస్థలకు చెందిన చట్టాలను అనుసరించే అనుమతుల మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

News March 29, 2024

ఆర్కిడ్ సొసైటీ అధ్యక్షుడిగా జానకిరామ్

image

తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ టి.జానకిరామ్ ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయనను నియమించారు. రెండేళ్లపాటు ఈ పదవిలో జానకిరామ్ కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయనను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు, రీసెర్చ్ డైరెక్టర్ నారం నాయుడు అభినందించారు.

News March 29, 2024

ఎన్నికల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: అనంత ఎస్పీ

image

ఎన్నికల్లో పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

News March 29, 2024

వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి: బాపట్ల కలెక్టర్

image

దివ్యాంగులు, వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఇదే అంశంపై గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో 14,525 మంది దివ్యాంగ ఓటర్లు, 8,633 మంది వృద్ధ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.

News March 29, 2024

ఒక్క ఛాన్స్ ఇవ్వండి: మామిడి గోవిందరావు

image

ఒక్క ఛాన్స్ ఇస్తే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. టీడీపీ అధిష్ఠానం పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా మామిడి గోవిందరావును ప్రకటించిన అనంతరం తొలిసారి రావడంతో కూటమి సభ్యులతో కలిసి ర్యాలీగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకుని, పాతపట్నం మామిడి గోవిందరావు క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.

News March 29, 2024

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో కర్నూలు కలెక్టర్ సమీక్ష

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల అంశాలపై ఆర్వో లు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు చేసిన ప్రజల ఐడెంటిటీ రహస్యంగా ఉంచాలని ఆదేశించారు.

News March 29, 2024

నేడు జిల్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు

image

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు జిల్లాకు రానున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పెదఅమిరంలో ఉన్న ఆయన కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు, ఆయన అభిమానులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.

News March 29, 2024

కడప: ప్రత్యేక కేటగిరీ ఓటర్లకు సదుపాయాలను సిద్ధం చేయాలి

image

ఓటింగ్ సమయంలో ప్రత్యేక కేటగిరీకి చెందిన దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జండర్ ఓటర్లకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఎంసీసీ ఉల్లంఘన జరగకూడదన్నారు.

News March 29, 2024

సరిహద్దు ప్రాంతాలలో నిరంతర నిఘాను ఏర్పాటు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట, నల్గొండ, పల్నాడు జిల్లాల అధికారులతో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల భద్రత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవి శంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల గుండా నిబంధనలు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరుగకుండా నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.