Andhra Pradesh

News March 28, 2024

పెండ్లిమర్రి: పది ఏళ్లు క్యాన్సర్‌తో పోరాటం.. చివరికి

image

నలుగురు పిల్లలు, పది ఏళ్లు క్యాన్సర్‌తో పోరాటం, బతకాలనే ఆశ చివరికి ఇవేమి పని పనిచేయక ఓ మహిళ మృతి చెందింది. పెండ్లిమర్రికి చెందిన గంగులమ్మ (80) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. ఇవాళ ఉదయం 10 గంటలకు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గత పది సంవత్సరాలుగా గంగులమ్మ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుండేదన్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ చనిపోయినట్లు తెలిపారు.

News March 28, 2024

2న శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 9న ఉగాది ఆస్థానం జరగనుంది. ఈక్రమంలో ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

News March 28, 2024

పశ్చిమ ప్రకాశంను వీడని కరువు.. ప్రజల వలస

image

కరువుతో పశ్చిమ ప్రకాశం ప్రజలు వలసబాట పడుతున్నారు. ఉన్న ఊళ్లో బతుకుభారమై పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాలకు తరలి వెళ్తున్నారు. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో చాలా గ్రామాలు జనం లేక వెలవెలబోతున్నాయి. అడపాదడపా తాగునీరు అందిస్తున్నప్పటికీ చాలీచాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కరువు నివారణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు..

News March 28, 2024

ఈవీఎంలు పల్నాడు, బాపట్ల జిల్లాకు కేటాయించాం

image

ఎన్నికల సంఘం గుంటూరు GMCకి కేటాయించిన EVMలలో కొన్నింటిని గత ఏడాది పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఇచ్చామని నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరుకి అవసరమున్నందున వాటిని తిరిగి ఆయా జిల్లా అధికారులు శనివారం అందించనున్నారని కమిషనర్ తెలిపారు. వచ్చిన ఈవీఎంలను గోడౌన్ నందు భద్రపరుచుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News March 28, 2024

మక్కువ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం మక్కువ ఎస్సై నరసింహ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కన్నంపేట గ్రామానికి చెందిన చీపురు ఉమామహేశ్వరరావు(40) బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన పెళ్లి మండపం పనులు చేస్తుండగా, విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 28, 2024

‘నగరిలో రోజా ఓడిపోతారు’

image

నగరిలో రోజాకు అసమ్మతి నేతల తలనొప్పి తగ్గడం లేదు. YCP పెద్దల పిలుపుతో 5 మండలాల నాయకులు అమరావతి వెళ్లారు. రోజా కోసం అందరూ కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించారు. ‘మేము వద్దన్నా రోజాకు టికెట్ ఇచ్చారు. అందరూ కలిసి పని చేసినా ఆమె ఓడిపోతారు. తర్వాత మేమే ఓడించాం అని ఆమె ప్రచారం చేస్తారు. ఆ నిందలు మాకెందుకు’ అని నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. తర్వాత వారికి రోజా నమస్కారం చేసినా నేతలు ముఖం చాటేశారు.

News March 28, 2024

ఎడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

image

మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు, ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వైపు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి NRI ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

కర్నూలు: పల్లె లక్ష్మన్న శవం ఆచూకీ లభ్యం

image

దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన లక్ష్మన్న మృతదేహాం ఇవాళ లభ్యమైంది. అనంతపురం జిల్లా పామిడి బైపాస్ రోడ్‌లో బ్రిడ్జి కింద ముళ్లపొదలలో అతడి తల, మొండెం వేరుగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. అనుమానితులుగా మృతుడి భార్య, కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 40 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది.

News March 28, 2024

ఉరవకొండ: గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

ఉరవకొండ పట్టణంలోని 10వార్డ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శర్మాస్ వలి(23) బుధవారం సాయంత్రం బెంగళూరులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పీజీలో ఉంటున్న అతడికి ఉన్న ఫలంగా ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 28, 2024

నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. రాపూరు మండలం గోనుపల్లికి చెందిన ఓ యువతి పొదలకూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో ఇవాళ విద్యార్థిని విష ద్రావకం తాగింది. గమనించిన స్థానికులు పొదలకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.