India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 2026 నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయవలసి ఉన్నందున సంబంధిత అధికారులందరూ పేదల గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మార్చికి పూర్తి చేసుకోకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు చేస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు.
ఎమ్మెల్యే గణబాబు ప్రస్తావించిన జోనల్ కమిషనర్ల అధికారాల బదలాయింపుపై మంత్రి నారాయణ స్పందించారు. విశాఖలో జోన్ల ఏర్పాటు పూర్తయిందని, వాటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తక్షణమే జారీ చేస్తామన్నారు. సింహాచలం టీడీఆర్ బాండ్ల సమస్యపై దేవదాయ శాఖతో చర్చిస్తున్నామని, త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.
బాల్య వివాహాలు జరిపిస్తే మత పెద్దలకు కఠిన చర్యలు తప్పవని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు. బుధవారం శ్రీకాకుళం న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాలపై మత పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలియజేశారు. బాలికలను బాగా చదివించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీఐ శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విజయవాడలో మాట్లాడారు. ‘వివేకా హంతకులే శంకరయ్యను నడిపిస్తున్నారు. ఆయనకు సభా హక్కుల నోటీసు ఇస్తాం. హంతకులతో కుమ్మక్కైన శంకరయ్యపై విచారణ జరిపి డీజీపీ చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. వివేకా హత్య రక్తం మరకలు కడుగుతుంటే శంకయ్య ఏం చేశాడని ప్రశ్నించారు.
ఏపీ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్గా టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. చాలా ఏళ్ల నుంచి సోమిరెడ్డి అనుచరుడిగా శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతున్నారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మున్సిపాల్టీల ఆస్తి పన్ను ఆదాయం రూ.258.95 కోట్లు ఉండగా, దీనిపై 20శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. దీంతో రూ.52 కోట్లు అదనంగా రాబట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇంటింటి సర్వేలు ప్రారంభమయ్యాయి. గతంలో జరిగిన అక్రమాలు, తప్పు కొలతల కారణంగా పన్ను నష్టం వాటిల్లిందని గుర్తించిన అధికారులు, ఈసారి పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నారు.
గుంటూరు జిల్లా ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తరువాత సర్టిఫికెట్ల ధృవీకరణ తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐల్లో జరుగుతుందన్నారు. 29న తెనాలి ప్రభుత్వ ఐటీఐలో, 30న ప్రైవేట్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు అరుదైన అవకాశం వచ్చింది. ఇవాళ ఉదయం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు సభను ప్రారంభించారు. కొన్ని చర్చల తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఆ సమయంలో ఛైర్మన్ హోదాలో రవిచంద్ర ఆ కుర్చీలో కూర్చొని సభను నడిపించారు. సభ్యుల ప్రశ్నోత్తరాల సమయానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూశారు.
కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి 167AG నిర్మాణానికి కేంద్రం భూసేకరణ అనుమతి ఇచ్చింది. మేడికొండూరు మండలం కొర్రపాడు, మేడికొండూరు, మంగళగిరిపాడు, ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామాల్లో 63 మంది యజమానుల నుంచి 14.82 హెక్టార్ల భూమిని సేకరిస్తారు. రోడ్డు రవాణా శాఖ ప్రకటన ప్రకారం, ఈ భూసేకరణ రహదారి నిర్మాణంలో కీలకమైన దశ. భూమి సేకరణ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.
గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చేనెల 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయకుండా ఆపివేస్తామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని MPDO కార్యాలయంలో MPDO చెన్నారావుకు సచివాలయ ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ వాలంటరీలు చేయవలసిన పనులన్నీ తమచేత చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.