India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం పర్యటించనున్నారు. తాళ్లకేర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు టీడీపీ కార్యాలయం సోమవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పింఛన్ పంపిణీ చేయనున్నారు.
పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్‌ని త్రీ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పెన్షన్లు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,65,067 మంది పెన్షన్ దారులకు రూ.112.79 కోట్లు పెన్షన్లు పంపిణీ చేయునట్లు తెలిపారు.
గ్రామ సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహించరాదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది స్నేహపూరితమైన వాతావరణంలో మెలగాలని అన్నారు. సమయపాలన పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షకు హాజరు కాగలరన్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీఈవో తిరుమల చైతన్యపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెనాయుడుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యాశాఖలో జరిగిన పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వివరించగా ఆయన వెంటనే స్పందించి కమిషనర్ విజయరామరాజుకు ఫోన్లో మాట్లాడి సమస్యను సద్దుమణిగినట్లు చూడాలని తెలిపారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయని కేంద్ర మంత్రి వర్మ అన్నారు. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైనా చర్చించారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట టీటీడీ పరిపాలన భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి బ్రహ్మోత్సవాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు.
విశాఖ మేయర్ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్ ఎం.హరేంద్ర ప్రసాద్‌కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్‌కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.