India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చలు కొనసాగినట్లు సమాచారం.
వైసీపీ అధికారికంగా కొనుగోలు చేసిన ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నిమిత‍్తం పార్టీకి అవసరమైన సామగ్రిని 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 14వ తేదీ వరకు వివిధ తేదీల్లో పలు సంస్థల నుంచి జీఎస్‌టీ చెల్లించి మరీ కొనుగోలు చేసినట్లు చెప్పారు.
భారత్, యూఎస్‌ల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్–2024 సీఫేజ్ విన్యాసాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం విశాఖ సముద్ర తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో విన్యాసాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ, మానవతా సహాయం పేరుతో రెండో రోజు విన్యాసాలు సాగాయి. భారత్‌కు ఐఎన్‌ఎస్ జలశ్వా ప్రాతినిధ్యం వహించగా, యూఎస్‌కు యూఎస్‌ఎస్ సోమర్‌సెట్, యూఎస్‌ఎస్ హాల్‌సే యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.
అనంతపురం పట్టణానికి చెందిన అంజలి మృతిపై ముగ్గురిని అరెస్టు చేసినట్టు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బెల్దరి దస్తగిరి, బాలును అరెస్టు చేశామన్నారు. మృతురాలి కుటుంబీకులు వాంగ్మూలం ప్రకారం భర్తతో పాటు మరో ఇద్దరిపై విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిత్ర పక్షాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎన్. ఈశ్వరావును అధిష్ఠానం బుధవారం రాత్రి నిర్ణయించింది. వీరి స్వగ్రామం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయితీ నడుకుదిటిపాలెం. అతని తండ్రి నడుకుదిటి అప్పలకొండ 1982 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎన్. ఈశ్వరావు MBA, MCOM పూర్తి చేశారు. ఈయన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పని చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బనగానపల్లె మండలంలోని కైప అప్పలాపురం గ్రామాల మధ్య ఆటో బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం జరిగింది. టంగుటూరు గ్రామానికి చెందిన బాల చౌడయ్య(60) ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో బాల చౌడయ్య మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం కూనేరు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాయగడ వైపు నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు ఒక వ్యక్తి పట్టుబడినట్లు తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన కూడా మూడు కిలోల గంజాయితో ఇద్దరు మైనర్లు పట్టుబడిన విషయం తెలిసిందే.
నెల్లూరులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని చోట్ల నేతల వారసులు ప్రచారంలో మెరుస్తున్నారు. నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్ భార్య, నారాయణ భార్య, కుమార్తెలు, రూరల్‌లో కోటంరెడ్డి కుటుంబసభ్యులు, కోవూరులో ప్రశాంతిరెడ్డి కుమారుడు, కుమార్తె, నల్లపరెడ్డి కుమారుడు, సర్వేపల్లిలో కాకాణి కుమార్తె, సోమిరెడ్డి కుమారుడు, కోడలు, గూడూరులో పాశం భార్య ప్రచారంలో నిమగ్నమయ్యారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మందికి సొంత ఇంటి కలలు నిజం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మంత్రి అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి ఝాన్సీ పాల్గొన్నారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతం అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబును డీఈఓ తాహేరా సుల్తానా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాశాఖ పట్ల గౌరవం కనబరిచిన కలెక్టర్‌కు డీఈవో పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో ఘంటసాల మండల ఎంఈఓ మోమిన్, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.