Andhra Pradesh

News March 27, 2024

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా సమగ్ర ప్రణాళిక: కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగునీటి అవసరాల కొరకు ఏప్రిల్ 8వ తేదీన సాగర్ నీరు విడుదల కానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. విడుదలయ్యే నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు.

News March 27, 2024

సీఎం జగన్‌ను కలిసిన గోరుముచ్చు గోపాల్ యాదవ్

image

ఏలూరు జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మొన్నటి వరకు టీడీపీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ మంగళవారం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. బీసీలకు సీఎం జగన్ న్యాయం చేశారని ఆయన తెలిపారు.

News March 27, 2024

పార్వతీపురం: ‘మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి’

image

రానున్న మూడు నెలలలో మంచినీటి సరఫరాకు కావలసిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ది అధికారులు, మండల ఇంజినీరింగు అధికారులతో మంచినీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News March 27, 2024

కృష్ణా జిల్లా వాసులకు పోలీసుల ముఖ్య విజ్ఞప్తి

image

డబ్బు సంపాదన కోసం క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన మచిలీపట్నంలోని తన కార్యాలయం నుంచి మంగళవారం తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ సీజన్ జరుగుతున్నందున అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి కుటుంబాలను అంధకారంలో పడవేయవద్దని అద్నాన్ నయీం అస్మి కోరారు.

News March 27, 2024

అనకాపల్లి: ‘వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి’

image

అనకాపల్లి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రవి సుభాష్ ఆదేశించారు ‌ మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ పురపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల నీటిమట్టాలను అంచనా వేస్తూ అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలన్నారు. మరమ్మతులకు గురైన బోరుబావులను యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు.

News March 27, 2024

తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు ఇవే

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్‌లో జ‌రగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాలు ఇలా ఉంటాయి. 5న శ్రీ అన్న‌మాచార్య వ‌ర్ధంతి, 7న మాస‌ శివ‌రాత్రి, 8న స‌ర్వ అమావాస్య‌ పూజలు చేశారు. 9న శ్రీక్రోధినామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం, 11న మ‌త్స్య‌జ‌యంతి జరుగుతుంది. 17న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం, 18న శ్రీ‌రామప‌ట్టాభిషేక ఆస్థానం, 19న స‌ర్వ ఏకాద‌శి, 21 నుంచి 23వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు నిర్వహిస్తారు.

News March 26, 2024

విశాఖ: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

image

విశాఖలో ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద వేగంగా వెళుతున్న ఆటో బోల్తా పడడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో వేగంగా వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నాలుగవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2024

నెల్లూరులో రంగడి తేరు రేపే

image

ఉమ్మడి నెల్లూరు ప్రజలు ఎంతో ఆనందంగా భాగస్వాములయ్యే రంగడి తేరు (శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం) బుధవారం జరగనుంది. ఉదయం 8.30 గంటలకు సర్వాలంకార శోభితులైన దేవేరుల సమేత రంగనాథుడు విశేషంగా అలంకరించిన రథంలో కొలువుదీరుతారు. అనంతరం గోపురం వీధిలో రైల్వే గేటు వరకు తిరిగి ఆలయం మీదుగా సంతపేట నాలుగు కాళ్ల మండపం వరకు రథోత్సవం సాగనుంది. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

News March 26, 2024

రాజుపాలెం: గడ్డివామి దగ్ధం.. రూ.లక్ష నష్టం

image

రాజుపాలెంలో మంగళవారం సాయంత్రం గడ్డివామి దగ్ధమైంది. రైతు కాచన జయచంద్ర రెడ్డి పశువుల మేత కోసం గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా గడ్డివామిలో నుంచి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ప్రొద్దుటూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 26, 2024

అమలాపురం: RRRకు టికెట్ ఇవ్వాలని క్యాండిల్ ర్యాలీ

image

మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నరసాపురం పార్లమెంటు సీటు వెంటనే టీడీపీ కేటాయించాలని డిమాండ్ చేస్తూ RRR ఆర్మీ ఆధ్వర్యంలో అమలాపురంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిలో నరసాపురం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దంతులూరి శ్రీనివాసరాజు, చిలువూరి సతీష్ రాజు, దెందుకూరి సత్తిబాబు, తదితరులు ఉన్నారు.