India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కశింకోట మండలం జి భీమవరం వంతెన వద్ద మంగళవారం స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు రావికమతం మండలం గొల్లలపాలెంకు చెందిన ఎస్.లక్ష్మమ్మ(65)గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో ఆమె అల్లుడు శృంగవరపు రాము గాయపడ్డాడు. కశింకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ద్వారా ఆదాయం రూ.1,29,30,598 లభించింది. మంగళవారం ఆలయంలో హుండీలను తెరిచి లెక్కించారు. 89 గ్రాముల బంగారం, 9 కిలోల 350 గ్రాములు వెండి లభించింది. అలాగే వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి అనుబంధంగా గల పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం రూ.8,10,455 లభించింది.
ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందు లబ్ధిదారుల వద్ద నున్న పాస్ పుస్తకాల పైన లేదా ఏ ఇతర లబ్ధిదారు కార్డుల పైన ఉన్న ప్రభుత్వ లోగోలు, ముఖ్యమంత్రి ఫోటోలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి రావని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. కోడ్ రాక ముందు వేసిన శిలా ఫలకాలు, సర్వే రాళ్లకు కూడా కోడ్ వర్తించదని తెలిపారు. మోడల్ కోడ్ అమలు అదికారులు కోడ్‌లోని అంశాలను క్షున్నంగా చదవాలని తెలిపారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ద్వారా ఆదాయం రూ.1,29,30,598 లభించింది. మంగళవారం ఆలయంలో హుండీలను తెరిచి లెక్కించారు. 89 గ్రాముల బంగారం, 9 కిలోల 350 గ్రాములు వెండి లభించింది. అలాగే వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి అనుబంధంగా గల పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం రూ.8,10,455 లభించింది.
రుద్రవరం మండల కేంద్రంలోని బ్రహ్మయ్య ఆచారి, రాజేశ్వరి దంపతుల కుమారుడు లక్ష్మీ నరసయ్య ఆచారి 18 నెలలు వడదెబ్బ సోకి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సోమవారం అహోబిలంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు వెళ్లి తలనీలాలు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం చూస్తే చిన్నారి కదలక పోవడంతో స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు.
నెల్లూరు నుంచి మైదుకూరు వైపు వెళుతున్న లోడు లారీ మంగళవారం బద్వేల్ పట్టణంలోని శేఖర్ థియేటర్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ముందువైపు టైర్ పగలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. లారీ నెమ్మదిగా రావడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
జనసేన నేత గంటా నరహరి వైసీపీలో చేరారు. గతంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా పని చేసిన ఆయన ఈనెల 13న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నరహరితో చర్చించారు. ఇవాళ CM క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో YCP తీర్థం పుచ్చుకున్నారు.
దర్శి మండలం తూర్పువీరయ్యపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న దేసు జయప్రకాష్ (48) మంగళవారం మృతి చెందారు. గత పది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వీఆర్వో సంఘం నాయకులు, దర్శి మండలం వీఆర్వో ఉద్యోగులు సంతాపం తెలిపారు.
ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నరసాపురం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే ఎనిమిది రైళ్లు ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే – నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా తేదీలలో మచిలీపట్నం, నరసాపురం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి.
ఖరిఫ్ 2023-24 సీజన్ ముగింపు దశ కారణంగా ఈ నెలాఖరులోగా రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన RBKల ద్వారా ప్రభుత్వానికి విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నవీన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాని రైతు భరోసా కేంద్రాల వద్ద మద్దతు ధరకు విక్రయించాలన్నారు. మార్చి 31 దాటితే రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరగదన్నారు.
Sorry, no posts matched your criteria.