Andhra Pradesh

News March 26, 2024

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నా: పరిపూర్ణానంద స్వామి

image

హిందూపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. బీజేపీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బీకే.పార్థసారథిని కూటమి ఖరారు చేసింది. ఆశించిన టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని పరిపూర్ణానంద నిర్ణయించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నామినేషన్ వేస్తానంటున్నారు.

News March 26, 2024

చెక్ పోస్టులలో నిఘా పెంచాం: ఎస్పీ

image

జిల్లాలోని అన్ని చెక్ పోస్టులలో 3 షిఫ్టులలో పోలీసు అధికారులు, సిబ్బందితో నిఘా పెంచామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. విలువైన వస్తువులకు రశీదు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆధారాలు చూపితే పరిశీలించి నిబంధనల మేరకు పట్టుబడిన వాటిని అందిస్తామన్నారు. జిల్లాలోకి అక్రమంగా ఏమీ రాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. నిరంతరం సిబ్బంది విధుల్లో ఉండి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు.

News March 26, 2024

సామాజిక సమీకరణలో కర్నూలు నుంచి సామాన్యులు పోటీ

image

కర్నూలు MP స్థానానికి YCP, TDP నుంచి BC సామాజికవర్గ నేతలు పోటీ పడుతున్నారు. కురువ సామాజిక వర్గానికి చెందిన MPTC సభ్యుడు నాగరాజు TDP నుంచి, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్ BY రామయ్య YCP నుంచి బరిలో దిగనున్నారు. ఇద్దరు సామాన్యులకు టికెట్లు కేటాయించి సామాజిక సమీకరణలో ఇరు పార్టీలు సమతుల్యం పాటించాయి. అయితే గెలిచి నిలిచేదెవరో కామెంట్ చేయండి.

News March 26, 2024

నెల్లూరు: నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు

image

గూడూరు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. YCPని వీడి BJPలో చేరిన గూడూరు MLA వరప్రసాద్‌కు ఆ పార్టీ తిరుపతి టికెట్ కేటాయించింది. ఈక్రమంలో తొలిసారిగా గూడూరుకి వచ్చిన ఆయనకు TDP, జనసేన, BJP శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పొత్తులో భాగంగా గూడూరు నుంచి పాశం సునీల్, తిరుపతి MP అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రత్యర్థులుగా తలపడిన వీళ్లు ఇప్పుడు ఒకే కూటమి కింద ఒకరికొకరు ప్రచారం చేసుకుంటున్నారు.

News March 26, 2024

రాయచోటిలో ఆ MLA 5వ సారి గెలుస్తారా..?

image

రాయచోటిలో 1952 నుంచి 17సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే గడికోట శ్రీంకాత్ రెడ్డి 2009 నుంచి వరుసగా 4సార్లు గెలుపొందారు. 2012 ఎన్నికల్లో TDP అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం మరోమారు అవకాశం ఇచ్చింది. కాగా TDP నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి ఇరువురిలో ఎవరు విజయం సాధించనున్నారు. కామెంట్ చేయండి.

News March 26, 2024

ఎన్టీఆర్ జిల్లాకు పోలింగ్ సిబ్బంది ఎంత మందో తెలుసా?

image

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్నికల టీమ్‌ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ సిబ్బంది కసరత్తు పూర్తిచేసింది. జిల్లా వ్యాప్తంగా 23 వేలమంది ఎన్నికల సిబ్బందిని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. పోలింగ్‌ పర్యవేక్షణ కోసం 7,200 మంది పోలీసు బలగాలు అవసరమని నిర్ణయించారు. మొత్తం ఐదు కంపెనీల బలగాలకు ఇప్పటి వరకు నాలుగు కంపెనీల బలగాలు వచ్చాయి.

News March 26, 2024

నెల్లూరు: టీడీపీకి మస్తాన్ యాదవ్ రాజీనామా

image

వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో వెనుకబడిన తరగతుల వారిపై చూపిన వివక్ష కారణంగా టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

News March 26, 2024

HOSTELలో నెల్లూరు యువకుడి SUICIDE

image

HYDలో నెల్లూరు జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు(M) పందలపాడుకు చెందిన కిరణ్ కుమార్(26) HYD వనస్థలిపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

REWIND: గుంటూరులో గల్లా జయదేవ్‌దే అత్యల్పం

image

గుంటూరు లోక్‌సభ నుంచి మహామహులు ఎన్నికయ్యారు. ఎన్జీ రంగా, లాల్ జాన్ బాషా, కొత్త రఘురామయ్య, రాయపాటి జయకేతనం ఎగురవేశారు. గత 2 పర్యాయాలు గల్లా జయదేవ్ ఇక్కడ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 69,111 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన.. 2019లో కేవలం 4,205 ఓట్లతో గట్టెక్కారు. ఈ లోక్‌సభ స్థానంలో ఇదే అత్యల్పం. ఈ ఎన్నికల్లో TDP కూటమి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, YCP నుంచి కిలారు రోశయ్య బరిలో దిగుతున్నారు.

News March 26, 2024

ఘంటసాల మేనల్లుడు మృతి

image

గాన గంధర్వుడు ఘంటసాల మేనల్లుడు బుద్దు వెంకటసుబ్బయ్య శర్మ(75) మంగళవారం మోపిదేవిలో అనారోగ్యంతో మరణించారు. ఈయన వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయుడు. నెమలి, ఏటిమొగ, నాగాయలంక, తలగడదీవి, బావదేవరపల్లి ఉన్నత పాఠశాలలో పని చేశారు. దాదాపు 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వంశపారపర్యంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకుడిగా ఈయన పని చేశారు.