Andhra Pradesh

News September 16, 2024

‘ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ’

image

స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహించనున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన అవశ్యకత ఉందన్నారు. జిల్లా స్థాయిలో భాగస్వామ్య సంస్థలతో ఇప్పటికే ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించామన్నారు.

News September 16, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనకాపల్లి ఎస్పీ

image

ప్రతి సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 16వ తారీకు నాడు రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 23వ తేదీన యధావిధిగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్జీదారులు కార్యాలయానికి రావద్దని సూచించారు.

News September 16, 2024

బొబ్బిలిలో ఈ నెల 22న ప్రత్యేక ప్రదర్శనలు

image

ఈ నెల 22న బొబ్బిలి శ్రీ కళాభారతి ఆడిటోరియంలో ఆనందో బ్రహ్మ ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని కళాభారతి ప్రధాన కార్యదర్శి నంబియార్ వేణుగోపాలరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం కళాభారతి ప్రాంగణంలో కళాకారులతో కలిసి ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సాంస్కృతిక విభాగంలో సకల కళా ప్రదర్శనలు ఉంటాయని ఎమ్మెల్యే బేబినాయన ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు.

News September 16, 2024

హోళగుందలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

image

హోళగుంద అయోధ్య నగర్ కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ స్తంభాలు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కాలనీవాసులు, మూగజీవాలు సంచరించే ప్రదేశంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను మార్చాలని వారు కోరారు.

News September 16, 2024

కృష్ణా: ‘లా’ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలల్లో B.A.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులేషన్ 2018 & 2023) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 21, 24, 26, 28వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News September 16, 2024

విజయవాడలో రూ.26 లక్షలు పలికిన లడ్డూ

image

విజయవాడ నున్న గ్రామంలో శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్‌లో వినాయకుడిని నెలకొల్పారు. ఈ వేడుకల్లో సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్ బాలాజీ వేడుకల చివరి రోజు స్వామివారి లడ్డూను రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి వినాయక చవితి వేడుకలను మరింత వైభోపేతంగా నిర్వహిస్తామన్నారు.

News September 15, 2024

విజయవాడ మీదగా తిరుపతికి ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డు(CHE), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం TPTY- CHE(నెం.07442), అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం CHE- TPTY(నెం.07443) ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 15, 2024

మనుబోలులో వినాయక ఉత్సవంలో అపశ్రుతి.. 30మందికి గాయాలు

image

మనుబోలు బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో ఇవాళ సాయంత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవం కోసం తెచ్చిన తారాజువ్వలపై నిప్పు రవ్వలు పడిన ఘటనలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

దేవీపట్నం: అనారోగ్యంతో పాఠశాల హెచ్ఎం మృతి

image

దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ఎంపీపీ యూపీ పాఠశాల హెడ్ మాస్టర్ కొమరం ధర్మన్న దొర (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. కిడ్నీ, షుగర్ వ్యాధులతో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. స్వగ్రామం పాముగండి గ్రామానికి చెందిన ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 15, 2024

VZM: TODAY TOP NEWS..

image

⁍భోగాపురంలో ఆకట్టుకున్న కోలాటం
⁍గంజాయి నియంత్రణకు ఆర్టీసీ సహకరించాలి
⁍జామిలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొన్న అధికారులు
⁍విజయనగరం: బంగారం షాపులో దొంగతనం
⁍పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్‌కు అరకు ఎంపీ ప్రత్యేక చొరవ
⁍జలపాతం నుంచి మృతదేహాలను వెలికితీసిన APSDRF
⁍కొత్తవలసలో వివాహిత సూసైడ్
⁍విజయనగరం జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలు