Andhra Pradesh

News March 26, 2024

వీరపనేనిగూడెం వద్ద ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

image

గన్నవరం మండలంలో వీరపనేని గూడెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిరిపల్లి నుంచి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిగా, 18 మందికి గాయాలయ్యాయి. ఆగిరిపల్లి నుంచి కూలీలు తీసుకొస్తున్న ఆటో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

News March 26, 2024

రూ.150 కోసం వెంటపడితే.. ప్రాణాలు పోయాయి!

image

ఏలూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెదవేగి మండలం వేగివాడ సెంటర్‌లో సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన హోటల్‌కు సోమవారం కొందరు వచ్చి టిఫిన్ చేశారు. బిల్ మొత్తం రూ.150 కాగా.. వారు రూ.15 ఫోన్ పేలో చెల్లించి వెళ్లిపోయారు. దీంతో సత్యనారాయణ బైక్‌పై సోదరి, కుమార్తెతో వారివెంటే వెళ్లారు. తిరిగి వస్తుండగా చక్రాయగూడెం సమీపంలో కారు ఢీకొని సత్యనారాయణ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు.

News March 26, 2024

చీరాల : వివాహిత హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

image

చీరాల మండలం కీర్తి వారిపాలెంలో స్థల వివాదం కారణంగా చోటు చేసుకున్న ఎలికా జ్యోతి అనే వివాహిత హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. మృతురాలి మరణ వాంగ్మూలం, బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసేమన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను చీరాల మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

News March 26, 2024

మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్: ముద్రగడ

image

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.

News March 26, 2024

VZM: మద్యం అక్రమరవాణా కేసుల నమోదు

image

జిల్లా వ్యాప్తంగా మద్యం అక్రమరవాణాపై పోలీసులు సోమ వారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులపై 16 కేసులు నమోదుచేసి 60.3 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై 32 కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 20 కేసులు, కోడిపందాలు, పేకాట ఆడుతున్న వారిపై మూడుకేసులు నమోదుచేసి, 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

News March 26, 2024

తిరుపతి: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

image

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన ఘటన సోమవారం చిన్నగొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అలసిపోయిన తల్లి గుడిసెలో నిద్రిస్తుండగా అదే ఇటుకల బట్టీలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన వేలు అనే యువకుడు చిన్నారిని పక్కనే ఉన్న గుడిసెలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతలో తల్లి నిద్ర లేచి గుడిసెలోకి వెళ్లి చూడగా నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 26, 2024

శ్రీకాకుళం: నేడు రాజశ్యామల హోమం

image

సీఎం జగన్ చేపట్టనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం రాజశ్యామల హోమం నిర్వహించనున్నట్లు కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సురిబాబు తెలిపారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఉన్న దుర్గా మహాలక్ష్మీ దేవాలయంలో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ యాగంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు, మహిళలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News March 26, 2024

పార్వతీపురం ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు

image

పార్వతీపురం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. ఈనెల 21న ఎలాంటి అనుమతులు లేకుండా పార్వతీపురం పట్టణం కొత్తవలసలో ఉ.8గంటలకు ప్రచారం చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అనంతరం పార్వతీపురం పట్టణ పోలీసులు జోగారావుపై కేసు నమోదు చేశారు. కాగా.. బొబ్బిలి ఎమ్మెల్యేపై కూడా ఇటీవల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది.

News March 26, 2024

అప్పన్నకు పెళ్లి కుదిరింది.. వచ్చే నెల 9న పెళ్లిరాట

image

సింహాచలంలో అప్పన్న స్వామి డోలోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. స్వామివారికి పిల్లని ఇవ్వాలంటూ సోదరి పైడితల్లమ్మ అమ్మవారిని అర్ధించే తంతు పూర్తిచేశారు. ఈ విధానాన్ని స్వామివారి పెళ్లిచూపులు(డోలోత్సవం) అంటారు. అనంతరం వారికి పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెల 9న ఉగాది రోజు పెండ్లిరాట, 19వ తేదీన చైత్ర ఏకాదశిన పురస్కరించుకొని వార్షిక కల్యాణోత్సవానికి స్వామివారు సిద్ధమవుతున్నారు.

News March 26, 2024

కోటబొమ్మాళి: చేపల వ్యాను బోల్తా

image

జాతీయ రహదారిపై కొత్తపేట కూడలి వద్ద ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంవైపు చేపలలోడుతో వెళ్తున్న వ్యాను టైరుపంక్చర్ కావడంతో సోమవారం బోల్తా పడింది. ఆక్సిజన్ సిలెండర్లు, నీటి ట్యాంకులు చెల్లాచెదురుకావడంతో చేపలు రహదారి పక్కన పడిపోయాయి. వాటిని ఏరుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. హైవే సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. వాహనంలో డ్రైవర్‌, మరోవ్యక్తి గాయాలు కాలేదు.