India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెట్టింపు లాభాలకు ఆశపడి, అపరిచిత వ్యక్తులు చెప్పింది నమ్మి, మోసపూరిత వెబ్ సైట్ లేదా యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోవద్దని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలనీ లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినవిల్లి వరసిద్ధి వినాయకుని దర్శనంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుడతారు. ప్రచారం, నామినేషన్ల దాఖలు ఇలా ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలో వినాయకుని ఆశీస్సులు తీసుకుంటారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అభ్యర్థులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి అయినవిల్లి సెంటిమెంట్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో.. వేచి చూడాలి.
అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం వార్షిక తిరునాళ్ల సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రసన్నాంజనేయ స్వామి, కొండమీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎన్నికల కోడ్ వల్ల రాజకీయ పార్టీల నేతలు ప్రభలు కట్టనప్పటికీ ఆలయం తరఫున ఒక ప్రభను ఏర్పాటు చేశారు. రాత్రికి విద్యుత్ దీపకాంతులతో సింగరకొండ పుణ్యక్షేత్రం ధగధగలాడుతోంది.
గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని క్షతగాత్రుల వివరాలు తెలియాల్సిఉందని పోలీసులు తెలిపారు.
విశాఖ పోర్టు 90 ఏళ్ల చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 72.01 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిన పోర్టు.. ఈ ఆర్థిక సంవత్సరం 2023–24 ముగియకుండానే పోర్టు 79 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. సరుకు హ్యాండ్లింగ్‌లో కూడా గత ఏడాదితో పోల్చితే సోమవారంతో 73,52,899 టన్నులు అధికంగా హ్యాండ్లింగ్ చేసింది.
రాయదుర్గంలోని మధుగులమ్మ దేవాలయం వద్ద ఓ సోమవారం సాయంత్రం చిన్నారిని గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలి వెళ్ళారు. పాప ఏడుపును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుమీద ఏడుస్తున్న రెండు ఆ చిన్నారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జడ్పీ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్య రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ కుప్పం రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్‌తో కలిసి వైసీపీలో చేరారు.
వడదెబ్బ తగిలి అయ్యన్న అనే రైతు మృతి చెందిన ఘటన కోసిగి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కోసిగిలోని 2వ వార్డుకు చెందిన అయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పొలం పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులున్నారు.
ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పొలమూరి మోహన్ బాబు బీఎస్పీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తనకు బీఎస్పీ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
పర్లాకిమిడి గజపతి రాజులుచే నిర్మించిన లివిరి గోపీనాధస్వామి ఆలయంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం మంగళవారం హోలీ జరుపుకుంటారు. తిరువీధి, వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గోపినాధస్వామి హోలీ ఉత్సవానికి ఆంధ్రా, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పర్లాకిమిడి మహారాజు వంశీయులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.