Andhra Pradesh

News March 25, 2024

నందికొట్కూర్: టీడీపీలో చేరనున్న చెరుకుచెర్ల రాఘరామయ్య

image

నందికొట్కూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు చెరుకుచెర్ల రఘురామయ్య 29న చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
సోమవారం ఆయన నందికొట్కూరులో మాట్లాడుతూ.. వైసీపీలో కష్టపడి పార్టీ కోసం సేవ చేసే వారికి గుర్తింపు లేకపోవడం వల్ల రాజీనామా చేశానన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామ చేశారు.

.

News March 25, 2024

సింహాద్రి అప్పన్నకు వైభవంగా పెళ్లి చూపులు

image

సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవం (పెళ్లి చూపులు) సోమవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎస్.శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు. తెల్లవారుజామున సింహాద్రినాదుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజు స్వామిని సర్ణాభరణాలతో అందంగా అలంకరించారు.

News March 25, 2024

ఉత్కంఠ రేపుతున్న మహిధర్ రెడ్డి మౌనం

image

YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.

News March 25, 2024

తిరుపతి: YCPని వీడిన వారికి జాక్‌పాట్..!

image

YCP చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానంద రెడ్డిని ప్రకటించడంతో MLA శ్రీనివాసులు జనసేన గూటికి చేరారు. ఆయనకు తిరుపతి MLA టికెట్ ఇచ్చారు. గూడూరు MLA వరప్రసాద్‌కు మరోసారి టికెట్ ఇవ్వడానికి YCP నిరాకరించగా BJPలో చేరారు. తిరుపతి MP టికెట్ దక్కించుకున్నారు. ఈ రెండు సీట్ల కోసం టీడీపీ, బీజేపీలో చాలా మంది సీనియర్లు పోటీ పడినా వీరికే దక్కడం విశేషం. రానున్న ఎన్నికల్లో తిరుపతి ఓటర్లకు సైకిల్ గుర్తు కనపడదు.

News March 25, 2024

నెల్లూరు జిల్లాలో కడప వాసి మృతి

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు సచివాలయ సమీపం వద్ద జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా ఖాజీపేటకు చెందిన వలస కూలీ సురేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

News March 25, 2024

గుడ్లూరులో అగ్ని ప్రమాదం

image

గుడ్లూరు మండలం చిన్నలాటిరఫీలో మల్యాద్రి అనే రైతుకు చెందిన వరిగడ్డి వాము దగ్ధమైంది. ప్రమాదవశాత్తు వరి గడ్డి వాముపై నిప్పు రవ్వలు పడడంతో పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా వరిగడ్డి వాము మొత్తం కాలిపోయింది. సుమారు రూ.25 వేలు విలువైన వరిగడ్డివాము దగ్ధమైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 25, 2024

పనబాకకు టికెట్ లేనట్లే..!

image

కావలికి చెందిన పనబాక లక్ష్మి నెల్లూరులో మూడు సార్లు, బాపట్లలో ఒకసారి MPగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత TDPలో చేరారు. 2019, 2021లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె తిరుపతి, బాపట్లలో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆ రెండు చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. దీన్ని ఆమె ఖండించారు.

News March 25, 2024

శ్రీకాకుళం: ‘గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్’

image

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పాతపట్నం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని మోహన బ్లాక్ పరిధిలోని అడవ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పాతపట్నం నుంచి హైదరాబాద్ కేంద్రానికి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా వారు చిక్కారు. వారి నుంచి సుమారు రూ.1,20,000/- విలువ గల 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News March 25, 2024

నరసాపురంలో MPగా గెలుపు ఎవరిది ?

image

నర్సాపురం రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు నరసాపురం ఉమ్మడి అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజు పోటీలో ఉంటారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు ఆ పార్టీ టికెట్ ప్రకటించింది. దీంతో నరసాపురంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరు ఉమా బాల, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మ బరిలో ఉన్నారు. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరితో వేచి చూడాలి..?

News March 25, 2024

వ్యక్తిగత కారణాలవల్లే అమర్నాథ్ రెడ్డి హత్య: డీఎస్పీ

image

నల్లమాడ మండలం కొట్టాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డిని కేవలం వ్యక్తిగత కారణాలతోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూ.. హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే చంపి ఉండవచ్చన్నారు.