India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ మలి విడత యాత్ర ప్రారంభం కానుంది. మంగళవారం పోలవరం, చింతలపూడి.. బుధవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరం.. గురువారం నూజివీడు, పెనమలూరు, గుడివాడలో ఆమె పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో (SEP) మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ఈ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
నల్లమాడ మండల పరిధిలోని కుటాలపల్లిలో టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని తోట వద్ద నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టగా నడింపల్లి గ్రామానికి చెందిన లగమ వెంకటసుబ్బారెడ్డి అలియాస్ గోపాల్ రెడ్డి, ఆదెన రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఒంటిమిట్ట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తుండగా, కడప నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బారెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందగా, రామచంద్రారెడ్డి మార్గమధ్యలో చనిపోయారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నరసరావుపేట లోక్‌సభ వైసీపీ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈయనే కాదు, నెల్లూరు నేతలు పలు ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నరసరావుపేట, విశాఖ, బాపట్ల MPగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు, నరసరావుపేట MPగా, పనబాక లక్ష్మి బాపట్ల MPగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో అనిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి.
సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు లోపలకు కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం పాలయిన సంఘటన వాడరేవులో ఆదివారం చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కారంచేడు మండలం తిమిడిదపాడు గ్రామానికి చెందిన రాజేశ్ దావీదు (25) ఆదివారం కుటుంబ సభ్యులతో సముద్ర స్నానానికి వెళ్లారు. రాజేశ్ కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పి లోపలికి వెళ్లాడే. అలల తాకిడికి ఆయన లోపలకు కొట్టుకుపోయి మృతి చెందాడు.
జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలకు గన్నవరం క్రీడాకారుడు హరికుమార్ ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి నాగరాజు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల29 నుంచి 31వ తేదీ వరకు ఆగ్రాలో జరుగనున్న జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలలో హరి పాల్గొనున్నట్లు చెప్పారు. అనంతరం హరి క్రీడలో ప్రతిభ కనపరిచి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు.
ఆదోని మండలం సంతేకుడ్లూరులో విచిత్ర ఆచారంతో హోలీ పండుగను జరుపుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. పురుషులంతా మహిళా వేషధారణలో రతీ మన్మధులను పూజిస్తారు. ఇలా పూజ చెయ్యటం వల్ల అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం. స్త్రీల మాదిరిగా పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలను చక్కగా అలంకరించుకుంటారు. గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండడానికి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు.
టీడీపీ మీద ఉన్న అభిమానన్ని ఓ వ్యక్తి కొత్తగా పంచుకున్నారు. బలిజపేట మండలానికి బసన్నారాయువలస గ్రామానికి కృష్ణారావు వివాహం మార్చి 24 ఆదివారం జరిగింది. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల వివరాలను పెళ్లి కార్డుపై ముద్రించి బంధువులకు అందించారు. పథకాలతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ బొబ్బిలి, పార్వతీపురం తెదేపా అభ్యర్థుల చిత్రాలను ముద్రించారు. ప్రస్తుతం ఈ పత్రిక వైరల్‌గా మారింది.
టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో గుమ్మనూరు జయరామ్‌కు చోటు దక్కలేదు. గుంతకల్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు ఐవీఆర్ఎస్ సర్వేలో అనుకూలత లేదని సీటు నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే గుంతకల్లులో పార్టీ కార్యాలయం స్థాపించి గుమ్మనూరు సోదరులు ప్రచారాలు సైతం నిర్వహించారు. అయితే అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ జనరల్ కెమిస్ట్రీ/ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, గేట్, నెట్ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 10.
Sorry, no posts matched your criteria.